సెలబ్రిటీలకు సంబంధించి అప్ డేట్ ఏదైనా తెలుసుకోవాలనే ఆత్రుత అభిమానులలో ఎప్పుడూ ఉంటుంది. సెలబ్రిటీల కెరీర్, ఫ్యామిలీ విషయాలను గురించి కాకుండా వారి ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి నెగటివ్ న్యూస్ వినిపించినా.. అభిమానులంతా కంగారు పడుతుంటారు. ఎందుకంటే.. అభిమాన సెలబ్రిటీలు అనారోగ్యానికి గురయ్యారని, హాస్పిటల్ లో చేరారని తెలిస్తే ఫ్యాన్స్ లో టెన్షన్ అంతా ఇంతా కాదు. అయితే.. ఇటీవల యాంకర్ లాస్య హాస్పిటల్ లో చేరిందంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ఇంతకీ లాస్యకు ఏమైందనే విషయం తెలియలేదు. కానీ.. ఆమె భర్తే త్వరగా కోలుకోవాలంటూ స్వయంగా ఇన్ స్టాగ్రామ్ లో వీడియో పోస్ట్ చేసేసరికి వార్త బయటికి వచ్చింది. ఇక యాంకర్ లాస్య గురించి తెలుగు బుల్లితెర ఆడియెన్స్ కి, బిగ్ బాస్ ఫాలోయర్స్ కి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యాంకరింగ్ తో కెరీర్ ప్రారంభించిన లాస్య.. చీమ, ఏనుగు జోక్స్ తో బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత టీవీ షోలు, సినిమాలు చేసి, బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా ఆకట్టుకుంది. బిగ్ బాస్ ద్వారా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న లాస్య.. ప్రస్తుతం అడపాదడపా షోలలో మెరుస్తూ.. సొంత యూట్యూబ్ ఛానల్ తో ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటోంది.
ఇదిలా ఉండగా.. లాస్య ఎందుకు హాస్పిటల్ లో చేరిందో కారణం తెలియలేదు. కానీ.. లాస్య భర్త మంజునాథ్ పోస్ట్ ద్వారా అందరికీ విషయం తెలిసింది. అయితే.. ఆ పోస్ట్ లో లాస్య బెడ్ పై పడుకొని కనిపించేసరికి.. సోషల్ మీడియాలో, పలు వెబ్ సైట్స్ కథనాలలో చాలా నెగటివ్ వార్తలు స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టారు. లాస్య పరిస్థితి విషమంగా ఉందని, బెడ్ పై నుండి లేవలేని స్థితిలో ఉందంటూ కథనాలు వెలువడ్డాయి. తాజాగా తన ఆరోగ్యంపై వచ్చిన పుకార్లపై లాస్య స్పందించి.. “ఆ వార్తలలో ఎలాంటి నిజం లేదని, కేవలం వైరల్ ఫీవర్ మాత్రమేనని.. దయచేసి అలాంటి నెగటివ్ వార్తలు స్ప్రెడ్ చేయొద్దని” రిక్వెస్ట్ చేస్తూ క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. మరి యాంకర్ లాస్య గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.