అల్లు రామలింగయ్య.. తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్యచతురతను ఓ స్థాయికి తీసుకెళ్లిన మహానటుడు. ఆయన తదనంతరం అతడి వారసుడిగా.. అల్లు అరవింద్ స్టార్ ప్రొడ్యూసర్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో వెలుగొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తండ్రి అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల సందర్భంగా ‘అలీతో సరదాగా’ షో మెుదటి ఎపిసోడ్ లో పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు అల్లు అరవింద్. ఇక రెండో భాగంలో గీతాఆర్ట్స్ సంస్థ గురించి, అసలు ఆ పేరులో ‘గీత’ అనే పదం వెనుక ఉన్న కథ గురించి.. మరిన్ని విషయాలను ఈ షోలో పంచుకున్నారు.
అల్లు అరవింద్.. సినిమా ఇండస్ట్రీలో మెగా ప్రొడ్యూసర్. ఏ సినిమా హిట్ అవుతుందో.. ఏ సినిమా ఫట్ అవుతుందో.. ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదనడంలో అతిశయోక్తి లేదు. దీనికి ఓ మచ్చుతునక తాజాగా అయన తెలుగులో రిలీజ్ చేసిన ‘కాంతారా‘ మూవీ అనొచ్చు. ఇప్పటికే ఈ మూవీ భారీ కలెక్షన్లతో దూసుకెళ్తున్నది. ఈ క్రమంలోనే అల్లు అరవింద్.. అలీతో సరదాగా రెండో ఎపిసోడ్ లో చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ గా మారాయి. యాంకర్ అలీ అసలు ‘గీతాఆర్ట్స్’ లో ‘గీత’ అంటే ఎవరు అని ప్రశ్నించగా.. అరవింద్ ఈ విధంగా సమాధానమిచ్చారు.”గీతా ఆర్ట్స్ అనే పేరును నాన్నగారు పెట్టారు. దానిని భగవద్గీత ను ఆధారంగా చేసుకుని పెట్టినట్లు నాకు చెప్పారు. దీనికి అర్ధం ఏమిటంటే? “ప్రయత్నం మాత్రమే మనది.. ఫలితం మాత్రం మన చేతుల్లో ఉండదు” అన్నది గీత సారాంశం.
అయితే ఇది వందకు వంద శాతం నిర్మాతలకు సరిపోతుంది. ఎందుకంటే సినిమా నిర్మించడం మా చేతుల్లో ఉంది గానీ.. దానిని హిట్ చేయడం, ఫట్ చేయడం ప్రేక్షకుల చేతుల్లోనే ఉంది” అని అన్నారు. అయితే నిర్మలా ఆర్ట్స్ అని పెళ్లి తర్వాత మర్చొచ్చు కదా? అని అలీ ప్రశ్నించగా..”గీతా ఆర్ట్స్ సంస్థలో తీసిన సినిమాలన్నీ అప్పట్లో సిల్వర్ జూబ్లీ ఆడాయి. దాంతో సెంటిమెంట్ పరంగా ఆ పేరును మార్చాలి అనుకోలేదు. ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే.. కాలేజీ రోజుల్లో నాకు ‘గీత’ అనే గర్ల్ ఫ్రెండ్ ఉండేది” అని నవ్వుతూ చెప్పారు. కాలేజీలో సమయంలో బస్సు కండక్టర్ తో గొడవ పడి, డ్రైవర్, కండక్టర్ ను దింపి నేనే బస్సును నడిపాను” అంటూ ఆ రోజుల్లో చేసిన అల్లరి పనుల గురించి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అల్లు అరవింద్ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ గా మారాయి. దీనికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ బయటకు రావాల్సి ఉంది.