ప్రస్తుతం సినీ ప్రపంచంలో బాగా వినిపిస్తున్న సినిమా పేరు ట్రిపులార్. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అయితే ఈ సినిమాపై పాజిటివ్ వార్తలు ఎన్ని నడుస్తున్నాయో.. కొన్ని దగ్గర్ల మూతివిరుపులు, నెగెటివ్ పబ్లిసిటీ కూడా నడుస్తూనే ఉంది. వాటిలో ఎక్కువ అటెన్షన్ క్యాచ్ చేసిం అలియా భట్ అంశం. అలియా ట్రిపులార్ టీమ్, ముఖ్యంగా రాజమౌళిపై అలిగిందని ప్రచారాలు చేస్తున్నారు. అందుకే సినిమా ప్రమోషన్స్ కూడా చేయడంలేదని చెబుతున్నారు.
ఇదీ చదవండి: RRR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సినిమాలో కీలక మార్పులు!
అసలు విషయం ఏంటంటే.. ట్రిపులార్ సినిమాలో అలియా భట్ నటించిన కొన్ని సీన్లు ఎడిటింగ్ లో పోయాయని, ఆ విషయంపై అసలు ఆమెకు ఎలాంటి సమాచారం లేదని చెబుతున్నారు. ముఖ్యంగా అందుకే అలియా భట్ అలిగిందని ప్రచారాలు చేస్తున్నారు. ఆమె సోషల్ మీడియాలో ఖాతాల్లోనూ ట్రిపులార్ కు సంబంధించిన పోస్టులు డిలీట్ చేసిందని చెబుతున్నారు. ఈ పుకార్లు జోరందుకోవడంతో నేరుగా అలియానే స్పందించింది. ఇలాంటి విషయాల్లో స్పందించను.. కానీ, ఇప్పుడు చెప్పాల్సి ఉంది అంటూ అలియా క్లారిటీ ఇచ్చింది.అలియా భట్ అలిగింది అనే వార్తలపై ఆమె స్పందించింది. ‘నేను RRR సినిమా విషయంలో అలిగానని వస్తున్న వార్తలను నమ్మకండి. నేను నా ఇన్ స్టాను కొన్నాళ్లకొకసారి అలైన్ చేస్తుంటాను. అంతేకానీ నేను ట్రిపులార్ సినిమా విషయంలో అసంతృప్తిగా ఉన్నాను అనేది నిజంకాదు. తారక్– రామ్ చరణ్– రాజమౌళి సార్ తో నటించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అంతటి గొప్ప ప్రాజెక్టులో నేను భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఇలాంటి పుకార్లపై స్పందించను కానీ, ట్రిపులార్ లాంటి సినిమాపై నెగెటివ్ గా వస్తుందనే ఉద్దేశంతో క్లారిటీ ఇస్తున్నాను’ అంటూ అలియా భట్ ఇన్ స్టా స్టోరీ పెట్టింది. దీన్ని బట్టి వస్తున్నవన్నీ పుకార్లేనని వాటిలో నిజంలేదని తెలుస్తోంది. అలియా భట్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.