త్రిబుల్ ఆర్ సినిమాతో తెలుగులో కూడా మంచి పేరు సంపాదించుకుంది నటి ఆలియా భట్. సినిమాలో కనిపించేది కాసేపే అయినా… ఆమె పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. ఇక బాలీవుడ్‌లో నంబర్ వన్ హీరోయిన్‌గా కొనసాగుతుంది ఆలియా. ఓ వైపు హీరోయిన్‌గా బిజీగా ఉంటూనే.. వ్యక్తిగత జీవితానికి కూడా తగిన ప్రాధాన్యం ఇస్తుంది. దానిలో భాగంగానే ప్రియుడు రణ్‌బీర్ కపూర్‌తో ఏడడుగులు నడిచింది. ఏప్రిల్ 14న ఆలియా-రణ్‌బీర్ కపూర్‌ల వివాహం జరిగింది. పెళ్లైన కొద్ది రోజులకే భార్యాభర్తలిద్దరూ షూటింగుల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో కొత్త పెళ్లి కుమార్తె ఆలియా భట్‌ని ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు నెటిజనులు. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: ఐ లవ్ యూ చెప్పిన ఆలియా పెళ్లి చేసుకోవడంతో బాధలో వీజే సన్నీ పోస్ట్!
ఆలియా భట్‌కు సంబంధించిన ఓ ఫోటోను వైరల్ భయాని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. అది కాస్త వైరల్ అయ్యింది. వైరల్ అయిన ఫోటోలో ఆలియా భట్ హెయిర్ స్టైల్ దీపికలా ఉండగా ఆలియా భట్ అందంగా కనిపించలేదు. దాంతో కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా.. ఆలియా భట్ కంటే పని మనిషి అందంగా ఉందని కామెంట్లు చేయగా.. మరి కొందరు నెటిజన్లు ఆమెను తీవ్రస్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. ఆలియా భట్.. దీపికను కాపీ కొడుతోందని కొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.
ఇది కూడా చదవండి: ఎన్టీఆర్ మూవీని రిజెక్ట్ చేసిన అలియా భట్.. కారణం?
మరికొందరేమో ముసలమ్మ.. నీ అవతారం చూసుకున్నావా.. ఇంత చండలంగా తయారవయ్యావ్ ఏంటి అని ఓ రేంజ్‌లో ఆలియాను ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ విమర్శలపై ఆలియా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆమె డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటి అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. మరి ఆలియా లుక్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: RRR బృందంపై అలియా భట్ నిజంగానే అలిగిందా?