ఎన్టీఆర్ పిల్లల కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కొత్త బట్టలు పంపించింది. ఎన్టీఆర్ కూడా తనకు ఏమి కావాలో ఆ హీరోయిన్ ని అడిగారు.
హీరో, హీరోయిన్ల మధ్య మంచి సంబంధాలు ఉంటాయి. కుటుంబంలా కలిసిపోతారు. హీరోలు, హీరోలే కాదు.. హీరోయిన్లతో కూడా ఒక కుటుంబంలా కలిసిపోతారు. సినిమా అయిపోయిన తర్వాత కూడా వారి రిలేషన్ అలానే కొనసాగుతుంది. సినిమాలో ఉండగా స్నేహితులు అవుతారు. కుటుంబంతో పరిచయం అవుతారు. ఆ తర్వాత కుటుంబంలో ఒకరిగా అయిపోతారు. ఏదైనా పండగ వస్తే బహుమతులు పంపించుకుంటారు. తాజాగా అలియా భట్ ఎన్టీఆర్ ఇంటికి బహుమతులు పంపించింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న హీరోయిన్ అలియా భట్.
నటిగానే కాకుండా బిజినెస్ ఉమెన్ గా కూడా ఆమె రాణిస్తోంది. గత ఏడాది బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ని వివాహం చేసుకున్న అలియా.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. పెళ్ళికి ముందే తనకు పుట్టబోయే పిల్లల కోసం ఆలోచించి.. 2021లో కాన్షియస్ క్లాతింగ్ పేరుతో ఒక దుస్తుల వ్యాపారాన్ని ప్రారంభించింది. అయితే ఆమె ఎన్టీఆర్ కు సర్ప్రైజ్ ఇచ్చింది. ఎన్టీఆర్ పిల్లలు నందమూరి అభయ్ రామ్, భార్గవ్ రామ్ లకు దుస్తులను పంపించింది. యూ ఆర్ మై ఫేవరెట్ హ్యూమన్ బీన్ అనే బ్యాగ్ లో ప్యాక్ చేసి.. అభయ్ రామ్, భార్గవ్ రామ్ పేర్లతో చెరో బ్యాగ్ కు ట్యాగ్ లు పెట్టి పంపించింది.
కాగా దీనిపై ఎన్టీఆర్ స్పందించారు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అలియా భట్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. కృతజ్ఞతలు అలియా.. నీ క్లాతింగ్ బ్రాండ్ ఎప్పుడూ అభయ్ రామ్, భార్గవ్ రామ్ ముఖాల్లో సంతోషాన్ని ఉంచుతుంది. తన పేరు మీద కూడా ఒక బ్యాగ్ చూడాలనుకుంటున్నా అంటూ స్టోరీ షేర్ చేశారు. దీనికి స్పందించిన అలియా.. ‘నీకు మాత్రం ఈద్ స్పెషల్ దుస్తులు సిద్ధం చేస్తానని, స్వీటెస్ట్ పర్సన్ థాంక్యూ అంటూ రిప్లై ఇచ్చింది. ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై మార్చి 24తో ఏడాది అయిన సందర్భంగా.. ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఆర్ఆర్ఆర్ అఫీషియల్ హ్యాండిల్ షేర్ చేసిన ‘వన్ ఇయర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్’ పోస్ట్ ను రీషెర్ చేసింది. మరి ఎన్టీఆర్ పిల్లలకు అలియా భట్ బట్టలు పంపడంపై మీ కామెంట్ ఏంటో తెలియజేయండి.