యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన RRR మూవీ విడుదలై వరల్డ్ వైడ్ గా కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. అయితే ఈ సినిమా విజయంతో జోరు మీదున్న ఎన్టీఆర్ మరో మూవీకి ప్లాన్ చేస్తున్నాడు. గతంలో కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ మూవీ సూపర్ హిట్ విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే దర్శకుడు కొరటాల శివ ఎన్టీఆర్ తో మరో సినిమాకు పచ్చ జెండా ఊపారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: RRR పై అసంతృప్తి.. జక్కన్నను అన్‌ఫాలో చేసిన హీరోయిన్!
దీనికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్స్‌లో యూనిట్ బిజీగా ఉందట. ఇక మరో విషయం ఏంటంటే? ఈ మూవీలో తారక్ సరసన బాలీవుడ్ అందాల బామ ఆలియా భట్ నటించబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. తారక్ సరసన నటిస్తున్నానని ఆమే స్వయంగా చెప్పినట్లుగా కూడా సమాచారం. మరి నిజంగానే తారక్ సరసన ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ నటిస్తుందో లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన వెలువడేంత వరకూ వెయిట్ చేయాల్సిందే. తారక్ సరసన ఆలియా భట్ నటించబోతుందనే వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.