ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ సినిమాలలో మాత్రమే కాకుండా సోషల్ మీడియా ఫోటోషూట్స్ లో కూడా గ్లామర్ ని ఒలికించడం చూస్తున్నాం. హీరోయిన్స్ గా సినిమాలు.. హీరోల పక్కన ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసేటప్పుడు లేదా సాంగ్స్ విషయంలో ఓకే. కానీ.. పెళ్ళైన తర్వాత.. ప్రెగ్నన్సీ వచ్చాక కూడా కొందరు కంటిన్యూ చేస్తున్నారు. ఈ విషయం పక్కనపెడితే.. ప్రెగ్నన్సీ వచ్చిన హీరోయిన్స్ బేబీ బంప్ అంటూ ఫోటోషూట్స్ చేయడం ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. కొద్దికాలంగా ఈ ట్రెండ్ ని స్టార్ హీరోయిన్స్ నుండి టీవీ ఆర్టిస్టుల వరకు ఫాలో అవుతున్నారు. ఇక ఈ బేబీ బంప్ ట్రెండ్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కూడా జాయిన్ అయిపోయింది.
ఈ ఏడాది ఆర్ఆర్ఆర్, గంగూబాయ్ కతియావాడి సినిమాలతో బ్లాక్ బస్టర్స్ ఖాతాలో వేసుకున్న అలియా.. ఇటీవల బ్రహ్మాస్త్రం మూవీతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది. మొత్తానికి ఒకే ఏడాది మూడు రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిన సినిమాలు చేసిన హీరోయిన్ గా అలియా రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో సింగపూర్ లో జరిగిన ‘టైమ్ 100 ఇంపాక్ట్’ అవార్డు అందుకుంది. దీంతో అవార్డు అందుకున్న ఆనందంలో అలియా బేబీ బంప్ ఫోటోషూట్ కూడా చేసేసింది. ఇక అవార్డు అందుకొని.. “10 ఏళ్ళ క్రితం నటించాలని అనుకున్నప్పుడే ఎంత కష్టమైన భరించాలని నిర్ణయించుకున్నాను. తెరపై ఎమోషన్స్ పండించడానికి మొదటి ప్రాధాన్యత ఇస్తాను.
నా కష్టాన్ని ప్రపంచం గుర్తిస్తే చాలని భావించాను. సినిమాల కోసం నా శరీరాన్ని కాపాడుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. కానీ.. ఫ్రెంచ్ ఫ్రైస్ తినడం మాత్రం ఆపలేను. ఎందుకంటే.. ఉన్న ఒక్క లైఫ్ ని ఆనందంగా ఎంజాయ్ చేయాలి” అని చెప్పుకొచ్చింది అలియా. ఇదిలా ఉండగా.. ఈ అవార్డు వేడుకలో అలియా ధరించిన డ్రెస్ ధర సుమారు రూ. 1.80 లక్షలు అని తెలుస్తుంది. ఇక అవార్డు పట్టుకొని ఫొటోలకు పోజులిచ్చిన అలియా.. మెరుస్తున్న గోల్డెన్ డ్రెస్ లో అందంగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ ఏడాది రణబీర్ కపూర్ ని పెళ్లాడిన అలియా.. పెళ్ళైన కొద్దిరోజులకే ప్రెగ్నన్సీ న్యూస్ చెప్పి షాకిచ్చింది. ప్రస్తుతం అలియా భట్ బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి.