Alia Bhatt: బాలీవుడ్ స్టార్ కపుల్ అలియా భట్, రణబీర్ కపూర్ దాదాపు ఆరేళ్ల ప్రేమాయణం తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ లో వివాహ బంధంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ, బంధుమిత్రుల సమక్షంలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న ఈ జంట.. పెళ్లైన రెండు నెలలకే అలియా ప్రెగ్నన్సీ న్యూస్ చెప్పి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేశారు. అయితే.. ప్రెగ్నన్సీ కారణంగా షూటింగ్స్ బ్రేక్ ఇవ్వకుండా అలియా ఇప్పటివరకు కమిట్ అయిన సినిమాలను పూర్తిచేసే పనిలో ఉంది.
అలియా పెళ్లికి ముందే ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ అనే హాలీవుడ్ మూవీని ఓకే చేసింది. ఈ క్రమంలో తాజాగా అలియా ఆ సినిమాకు సంబంధించి షూటింగ్ పూర్తిచేసుకుంది. అయితే.. పోర్చ్‌గల్‌లోని ఎడారిలో షూటింగ్ జరిగిన సమయంలో కొంతమంది అలియా ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలలో అలియా బేబీ బంప్ అనేది స్పష్టంగా కనిపిస్తుండటం మనం గమనించవచ్చు అంటున్నారు నెటిజన్స్.
ఇప్పుడు లీకైన అలియా బేబీ బంప్ ఫొటోలలో నెట్టింట తెగవైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోర్చ్‌గల్ కు సంబంధించిన షూటింగ్ ఫొటోలను అలియా కూడా షేర్ చేసింది. ఈ ఫోటోలలో తన బేబీ బంప్ కవర్ అయ్యేలా అలియా బ్లాక్ జాకెట్ ధరించిందని అంటున్నారు. ఇక షూటింగ్ పూర్తయిన సందర్భంగా హార్ట్ ఆఫ్ స్టోన్ చిత్రబృందానికి అలియా భట్ థ్యాంక్స్ చెప్పింది. ఈ మూవీ త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. మరి అలియా భట్ బేబీ బంప్ ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Alia bhatt on sets ‘Heart of Stone’! with
gal gadot in Bordeira Portugal yesterday 🌪 pic.twitter.com/CCfDmhnPaH— hourly ranlia (@goldencranlia) July 8, 2022
Heart of Stone – you have my wholeeeeeee heart ❤️❤️❤️ Thank you to the beautiful @GalGadot.. my director Tom Harper … #JamieDornan missed you today.. and WHOLE team for the unforgettable experience. pic.twitter.com/wYyDI8sO53
— Alia Bhatt (@aliaa08) July 8, 2022