బాలీవుడ్ ప్రేమజంట బంధుమిత్రుల మధ్య అట్టహాసంగా రణబీర్ కపూర్ – అలియా భట్ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. గత రెండ్రోజులుగా సోషల్ మీడియాలో వారి పెళ్లి ఫొటోలే వైరల్ గా మారాయి. బాంద్రాలోని రణబీర్ కపూర్ నివాసమైన ‘వాస్తు’లో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వారి వివాహం ఘనంగా జరిగింది. ఇక వీరి పెళ్లిలో బాలీవుడ్ సెలబ్రిటీలందరూ హాజరయ్యారు. పెళ్లి పనుల నుంచి మూడు ముళ్ళు పడేవరకు ఈ జంట ఒక్క ఫోటో కూడా లీక్ కాకుండా జాగ్రత్త పడ్డారు. పెళ్లి తర్వాత అధికారికంగా తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఫోటోలను షేర్ చేశారు. కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా లీకుల బెడద నుంచి తప్పించుకోలేకపోయారు.
ఇదీ చదవండి: OTTలోకి KGF 2.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే!
ప్రస్తుతం సోషల్ మీడియాలో రణబీర్ కపూర్- అలియా భట్ పెళ్లికి సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. అది వారిద్దరూ వరమాల వేసుకునే వీడియో. అలియా ఈ కాన్సెప్ట్‌పై ఓ చాక్లెట్ యాడ్ కూడా చేసింది. ఆ యాడ్ లోలా రణబీర్ కపూర్ ను ఇద్దరూ పైకి ఎత్తుకోగా.. అలియా మెడలో మాల వేశాడు. అటు అలియా వైపు ఎవరూ లేరు. యాడ్ లోలా ఆమె చాక్లెట్ తిని గాల్లోకి ఎగరలేదు కదా.. అలా చూస్తూ ఉండిపోయింది. ఓ ఇద్దరు వచ్చి ఎత్తుకునే లోపే.. రణబీర్ కపూర్ వెంటనే ఇందకు దిగి మోకాళ్లపై కూర్చుని అలియాతో వరమాల వేయించుకున్నాడు. ఆ ఒక్క పనితో రణబీర్ కు అలియాపై ఉన్న ప్రేమ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. మరి ఆ వైరల్ వీడియో మీరూ చూసేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి.
The whole Varmala ceremony🥺💜#RanbirKapoorAliaBhattWedding #RanbirAliaWedding pic.twitter.com/ddkN6apmwQ
— 𝓢𝓪𝓷𝓪🌸 // Team Groom✨ (@TypoQueeenie) April 14, 2022