ట్రిపుల్ ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకుంది సీత ఆలియాస్ ఆలియా భట్. బ్రహ్మస్త్రం సినిమా ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆలియా భట్ గర్భవతి. ఈ ఏడాది ఏప్రిల్ 14న ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసింది ఆలియా భట్. ఆ తర్వాత రెండు నెలలకే తాము తల్లిదండ్రులం కాబోతున్నాం అని ప్రకటించారు ఆలియా భట్-రణ్‌బీర్ కపూర్. ఈ వార్త విని చాలా మంది ఆశ్చర్యపోయారు. ఆ వెంటనే పెళ్లికి ముందే ఆలియా.. గర్భవతి అయి ఉంటుంది.. అందుకే అంత హడావుడిగా వివాహం చేసుకున్నారని జోరుగా వార్తలు వచ్చాయి. కానీ ఈ స్టార్ కపుల్ మాత్రం వాటిని ఏం పట్టించుకోలేదు. ఇక గర్భవతిగా ఉండి కూడా ఆలియా భట్.. బ్రహ్మస్త్రం సినిమా ప్రమోట్ చేయడానికి దేశంలో పలు నగరాలు తిరిగింది.
ఈ క్రమంలో తాజాగా ఆలియా భట్ ఆస్పత్రిలో చేరిందంటూ వార్తలు వస్తున్నాయి. ఆలియా భట్‌ని తీసుకుని సౌత్ ముంబైలోని గిరిగావ్‌లోని హెచ్ఎన్ రిలయన్స్ ఆస్పత్రిలో చేర్చారని సమాచారం. ఆలియాకు పురిటి నొప్పులు రావడంతోనే ఆమెను హుటాహుటిని ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఏ నిమిషంలోనైనా ఆలియాకు డెలివరీ అవ్వొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. మరికొన్ని గంటల్లోనే ఈ జంట తమ బిడ్డను ఈ భూమ్మీదకు ఆహ్వానించబోతున్నారని.. గంటల వ్యవధిలోనే శుభవార్త చెప్తారని జోరుగా ప్రచారం సాగుతోంది.