టాలీవుడ్ సీనియర్ నటుడు ఆలీ ఇటీవలే ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో జరిగిన భేటీ అనంతరం ఆలీ మీడియాతో మాట్లాడుతూ.. ‘సీఎం వైఎస్ జగన్ గారిని కలిశాను. త్వరలోనే గుడ్‌న్యూస్ ఉంటుందని ఆయన చెప్పారు. ఏమీ ఆశించకుండా పార్టీలోకి వచ్చాం. త్వరలోనే నా పదవిపై పార్టీ ఆఫీస్ నుంచి ప్రకటన వస్తుంది.
ఇక మెగాస్టార్ చిరంజీవి గారిని పిలిచి అవమానించడం అనేది జరగలేదు. అలా రాసి ప్రచారం చేశారు. టికెట్ రేట్ సమస్యలపై మాట్లాడేందుకు చిరంజీవి గారిని జగన్ గారు ఆహ్వానించారు. ఇంట్లోకి పిలిచి.. భోజనం పెట్టి.. కాసేపు చర్చించిన తర్వాత మళ్లీ కలుద్దాం అని చెప్పారు. అంతేగాని అందులో అవమానించడం గాని, వాంటెడ్ గా చేయడం అనేది ఎక్కడుంది?అయినా పిలిచి అవమానించేంత అవసరం ఆయనకేంటి? సామాన్యులకు కూడా సినిమా టికెట్ అందుబాటులో ఉండాలన్నదే ప్రభుత్వ ఆలోచన. త్వరలోనే సినీ ఇండస్ట్రీకి సంబంధించి సమస్యపై గుడ్ న్యూస్ రానుందని ఆశిస్తున్నాను’ అంటూ ఆలీ చెప్పారు. ప్రస్తుతం ఆలీ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా వీడియో చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.