హీరో, సెలబ్రిటీ, స్టార్స్ వీళ్లకు సమాజంలో ఉన్న మరో పేరే ఇన్‌ఫ్లూఎన్సర్స్. అంటే ప్రభావితం చేసే వ్యక్తులు అనమాట. వీళ్లు చెబితే ఓ నలుగురు అభిమానులు అయినా ఆ విషయాన్ని ఫాలో అవుతారు. అందుకే పెద్ద పెద్ద కంపెనీలు కోట్లు ఖర్చు పెట్టి సెలబ్రిటీలతో ఎండార్స్ మెంట్లు చేయిస్తుంటాయి. ఓ పేరున్న వ్యక్తితో చెప్పిస్తే తమ ప్రోడక్టుకు డిమాండ్ వస్తుందనేది వారి ఆలోచన. ఓ చిన్న మోడల్ నుంచి బడా హీరోల వరకు ఎంతో మంది ఈ కమర్శియల్స్ చేస్తూనే ఉన్నారు, ఉంటారు. అయితే ఆ సో కాల్ట్ ఇన్ ఫ్లూఎన్సర్స్ ఎలాంటి వస్తువు/ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నారు అనేదే ఇక్కడ ప్రశ్న.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ గొప్ప మనసు.. ఫ్యాన్స్ జీవితం కోసం కోట్లు కాదనుకున్నాడు..
తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. అల్లు అర్జున్ కు ఓ పెద్ద పాన్ మసాలా కంపెనీ తమ ప్రోడక్టుకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాలని కోరింది. అందుకు కోట్ల రూపాయలు ముట్టచెబుతామని ఆఫర్ ఇచ్చింది. ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్. భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ కు కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు. తాను ఒక మాట చెబితే వారంతా వింటారని ఐకాన్ స్టార్ కు తెలుసు. అందుకే తన అభిమానుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. కొన్ని కోట్ల రూపాయల కన్నా తన అభిమానుల ఆరోగ్యమే తనకు ముఖ్యం అని ఆ యాడ్ కు నో చెప్పాడు. భవిష్యత్ లోనూ తన అభిమానుల ఆరోగ్యానికి హాని చేసే ఎలాంటి ఉత్పత్తికీ తాను బ్రాంట్ అంబాసిడర్ గా వ్యవహరించనని తేల్చి చెప్పాడు.అయితే ఇలాంటి నిర్ణయం తీసుకున్న వారిలో అల్లు అర్జునే మొదిటి వ్యక్తి కాదు. గతంలోనూ చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్ వంటి టాలీవుడ్ సూపర్ స్టార్స్ సైతం ప్రజలకు హాని కలిగించే ఉత్పత్తులకు ఎలాంటి పబ్లిసిటీ ఇవ్వమని ప్రకటించారు. అలాగే హుందాగా వ్యవహరిస్తున్నారు కూడా. అయితే బాలీవుడ్ స్టార్లు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నారు. మనం దేనికి పబ్లిసిటీ ఇస్తున్నాం అనే విషయాన్ని పట్టించుకోకుండా.. మనకు ఎంత వస్తోంది అనే దానిపైనే వారు దృష్టి పెట్టారు. ఆ జాబితాలో అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, టైగర్ షార్ఫ్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్, అజయ్ దేవ్‌గణ్ వంటి ఎంతో మంది బాలీవుడ్ ప్రముఖులు ఉన్నారు. వారంతా కొన్ని రకాల పాన్ మసాలా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించినవారే. కొందరు ఇంకా వ్యవహరిస్తున్నారు కూడా.
ఇదీ చదవండి: దర్శకులు మారుతీ ఇంట తీవ్ర విషాదం..
ఆ విషయంలో వారిపై వ్యతిరేకత రాలేదా అంటే పుష్కలంగా వచ్చింది. వారిలో కొంతమంది అభిమానుల నుంచి సమాజం నుంచి వ్యతిరేకత రాగానే తప్పు తెలుసుకుని.. ఆ యాడ్ నుంచి తప్పుకున్నారు. అమితాబ్ బచ్చన్ కంపెనీతో కాంట్రాక్ట్ బ్రేక్ చేసుకుని ఆ యాడ్ నుంచి తప్పుకున్నారు. తాజాగా అక్షయ్ కుమార్ అలాంటి దిద్దుబాటు చర్యలకు పూనుకున్నాడు. ఇక నుంచి తాను ప్రజలకు హాని కలిగించే ప్రోడక్ట్స్ కోసం పబ్లిసిటీ చేయనని ప్రకటించాడు. ఆ యాడ్ కోసం తీసుకున్న డబ్బును ఏదైనా మంచి పని కోసం వినియోగిస్తానని వెల్లడించాడు. ఈ అన్ని పరిణామాలను గమనిస్తున్న అభిమానులు టాలీవుడ్ హీరోలకు, బాలీవుడ్ హీరోలకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని కామెంట్ చేస్తున్నారు. అభిమానులు, సమాజం గురించి బాలీవుడ్ హీరోలు ఆలోచించండం ప్రారంభిచాలంటూ హితవు పలుకుతున్నారు. అల్లు అర్జున్, అక్షయ్ కుమార్ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.