సాధారణంగా ఇండస్ట్రీలో సోషల్ ఎక్స్పరిమెంట్స్ పై, జనాలకు అవగాహన కల్పించే టాపిక్స్ పై సినిమాలు అరుదుగా వస్తుంటాయి. హీరోగా ఎన్ని సినిమాలతో బిజీగా ఉన్నా.. మధ్యమధ్యలో సోషల్ ఎక్సపెరిమెంటల్ సినిమాలు చేస్తుంటాడు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు ఏడాదికి ఒక సినిమా చేయడానికే నానా తంటాలు పడుతున్నారు. కనీసం ఒక్కో సినిమాకి రెండేళ్ల సమయం తీసుకుంటున్నారు. వారందరికీ భిన్నంగా అక్షయ్ కుమార్.. ఒక్కో ఏడాదిలో ఐదు నుండి ఆరు సినిమాలు రిలీజ్ చేస్తూ సర్ప్రైజ్ చేస్తున్నాడు.
ఇటీవల రామ్ సేతు మూవీతో హిట్ అందుకున్న అక్షయ్.. తాజాగా ‘మరాఠా సామ్రాట్ ఛత్రపతి శివాజీ’ సబ్జెక్టుతో ఓ సినిమా అనౌన్స్ చేశాడు. ప్రస్తుతం ‘వీర్ మరాఠా వీర్ దౌడ్ లే సాథ్’ అనే టైటిల్ తో ఈ సినిమాని నటుడు, దర్శకుడు మహేష్ మంజ్రేకర్ రూపొందించనున్నారు. కాగా.. తాజాగా సెక్స్ ఎడ్యుకేషన్ పై ఓ ఎక్స్పెరిమెంటల్ మూవీ అనౌన్స్ చేసి సర్ప్రైజ్ చేశాడు. ఈ విషయాన్నీ స్వయంగా అక్షయ్ కుమారే ప్రకటించడం విశేషం. అలాగే తాను ఇన్ని సినిమాల మధ్య సెక్స్ ఎడ్యుకేషన్ పై సినిమా(ఓ మై గాడ్ 2) ఎందుకు చేయబోతున్నాడో తెలియజేశాడు.
అక్షయ్ మాట్లాడుతూ.. “నేను ఎక్కువగా సోషల్ ఫిలిమ్స్ చేసేందుకు ఇంటరెస్ట్ పెడుతుంటాను. అందరి లైఫ్ లో ఉపయోగపడేవి.. దేశంలో చర్చించుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం ‘ఓ మై గాడ్ 2’ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా నా సినిమాలలో కథలు ఉంటాయి. అలాగే కమర్షియల్ అంశాలతో పాటు కామెడీ, ట్రాజెడీ కూడా ఉంటాయి.” అని చెప్పుకొచ్చాడు అక్షయ్. ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం. ఇదిలా ఉండగా.. తాజాగా ఛత్రపతి శివాజీ గెటప్ లో అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాని 2023 దీపావళి కానుకగా మరాఠితో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
#AkshayKumar𓃵 OMG Oh My God 2 is about sexual education, and the actor has confirmed that it will come out in April or May 2023.
.
For more updates, Follow @gossiprushoffl
.#OMGOhMyGod2 #OMG2 @akshaykumar #RedSeaIFF22 #RedSealFF22 #Trending #TrendingNow #gossiprush pic.twitter.com/TYNsmYdnW7— Gossip Rush (@gossiprushoffl) December 5, 2022