స్టార్ హీరో అక్షయ్ కుమార్ షూటింగ్ లో ఘోర ప్రమాదం జరిగిందట. ఏకంగా 100 అడుగుల లోయలో ఓ వ్యక్తి పడిపోయాడని, అతడి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఇంతకీ ఏం జరిగింది?
చిన్నదో పెద్దదో.. సినిమా షూటింగ్ అంటేనే చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చిత్రీకరణ పూర్తి చేయాలని పక్కాగా ప్లాన్ చేస్తుంటారు. అయినా సరే కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా అలాంటి అనుభవమే స్టార్ హీరో అక్షయ్ కుమార్ విషయంలో ఎదురైంది. ప్రస్తుతం ఛత్రపతి శివాజీ బయోపిక్ లో అక్షయ్ టైటిల్ రోల్ చేస్తున్నారు. షూటింగ్ లో భాగంగా ఓ లోయ దగ్గర షూట్ చేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో ఘోరమైన ప్రమాదం జరిగిందని న్యూస్ వచ్చింది. ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా తయారైందని అంటున్నారు. ఇండస్ట్రీలో ప్రస్తుతం ఇదే విషయం చర్చనీయాంశంగా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రతి ఏడాది నాలుగైదు సినిమాలు చేసే హీరోల్లో హిందీ స్టార్ అక్షయ్ కుమార్ కచ్చితంగా ఉంటారు. ఈ ఏడాది ఇప్పటికే ‘సెల్ఫీ’ చిత్రాన్ని రిలీజ్ చేసిన అక్షయ్.. ‘వేదాంత్ మరాఠీ వీర్ దౌడు సాత్’ షూటింగ్ లో పాల్గొంటున్నారు. కొల్హాపూర్ లోని పవన్ హల్ గడ్ లోని ఇది జరుగుతోంది. 19 ఏళ్ల నగేష్ ఖోబారో అనే ఫొటోగ్రాఫర్.. ప్రమాదవశాత్తూ 100 అడుగుల లోయలో పడిపోయాడట. అతడికి తీవ్ర గాయాలు కాగా, ప్రస్తుతం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని తెలుస్తోంది. పరిస్థితి మాత్రం ఇంకా విషమంగానే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయమై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
అయితే ఈ సంఘటనపై అటు మూవీ టీమ్, పోలీసులు గానీ అధికారికంగా ప్రకటన ఏం చేయలేదు. వాళ్లు ఏదైనా చెప్తేనే ఏం జరిగిందనేది పూర్తిగా తెలుస్తుంది. ఇదిలా ఉండగా శివాజీ మహారాజ్ జీవితకథతో తీస్తున్న ఈ సినిమాకు మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. జై దుధానే, ఉత్కర్ష్ షిండే, విశాల్ నికమ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతో పాటు ‘ఆకాశమే హద్దురా’ హిందీ రీమేక్, క్యాప్సుల్ గిల్, బడే మియా చోటే మియా చిత్రాల్లోనూ అక్షయ్ నటిస్తూ బిజీగా ఉన్నాడు. సరే ఇదంతా పక్కనబెడితే.. స్టార్ హీరో అక్షయ్ కుమార్ షూటింగ్ లో ఘోర ప్రమాదం జరిగిందనే వార్తలపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.