సీరియల్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టిన మృణాల్ ఠాకూర్ ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. బాలీవుడ్- టాలీవుడ్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మృణాల్ ఠాకూర్ గురించే చర్చ జరుగుతోంది.
మృణాల్ ఠాకూర్ అనే బదులు సీత అంటే తెలుగు ప్రేక్షకులు త్వరగా గుర్తుపడతారు. టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్లో సీతగా చెరగని ముద్ర వేసింది. సీతారామం సినిమా చేసినప్పటి నుంచి తెలుగువాళ్లు ఆమెను సీతగానే గుర్తు పెట్టుకున్నారు. ఒక సోప్ యాడ్ తో కెరీర్ మొదలు పెట్టిన మృణాల్.. ఆ తర్వాత కుంకుమ భాగ్య సీరియల్ తో ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. బాలీవుడ్ లో అయితే వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. ప్రస్తుతం అక్షయ్ తో చేసిన సాంగ్ ఒకటి యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. పాట రిలీజ్ అయిన దగ్గరి నుంచి సోషల్ మీడియా మొత్తం మృణాల్ గురించే చర్చ జరుగుతోంది.
ప్రముఖ తమిళ సినిమా డ్రైవింగ్ లైసెన్స్ కి రీమేక్ గా అక్షయ్ కుమార్ నటించిన ‘సెల్ఫీ’ సినిమా ఫిబ్రవరి 24న విడుదల కానుంది. ఈ సినిమాలో అక్షయ్ సరసన మృణాల్ ఠాకూర్ ఒక క్యామియో రోల్ చేసింది. ప్రస్తుతం ఆ సినిమా నుంచి అక్షయ్ కుమార్- మృణాల్ స్టెప్పులేసిన ‘కుడియీ నీ తేరి’ అనే సాంగ్ ని విడుదల చేశారు. ప్రస్తుతం ఆ సాంగ్ యూట్యూబ్, సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. నెట్టింట మృణాల్ గురించే చర్చ జరుగుతోంది. ఆమె అందం, స్టెప్పులు, చూపులతో కుర్రకారును కుదిపేస్తోందంటూ కామెంట్ చేస్తున్నారు. ఆమె ఫొటోస్, రీల్స్ మొత్తం షేర్ చేస్తూ తెగ సంబరపడిపోతున్నారు.
ఇంక మృణాల్ ఠాకూర్ కెరీర్ విషయానికి వస్తే.. హిందీలో వరుస సినిమాలు చేస్తోంది. సెల్ఫీలో క్యామియో రోల్, పూజా మేరీ జాన్ అనే సినిమా పూర్తై.. విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు హిందీలోనే పిప్పా అనే సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆంక్ మిచోలీ అనే బాలీవుడ్ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఇంక నాని సరసన మరోసారి తెలుగు ప్రేక్షకులను మృణాల్ పలకరించనుంది. నాని 30 సినిమాలో మృణాల్ హీరోయిన్ గా చేయనుంది. ఒక్క హిందీ, తెలుగులోనే కాకుండా మృణాల్ ఠాకూర్ మరాఠీలో కూడా 2 సినిమాల్లో నటించి మెప్పించింది.