ఆ స్టార్ హీరో వరసపెట్టి సినిమాలు చేస్తుంటాడు. స్టంట్స్, యాక్షన్ సీన్స్ అన్నీ డూప్స్ లేకుండా చేసేస్తాడు. ఈ క్రమంలోనే షూటింగ్ చేస్తుండగా తాజాగా ఓ ప్రమాదం జరిగింది. ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.
సినిమా షూటింగ్ అంటే చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రతి విషయంలోనూ చాలా కేర్ తీసుకుని పనిచేస్తుంటారు. అయినా సరే అప్పుడప్పుడు చిన్న వాటి నుంచి పెద్ద ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అయితే స్టార్ హీరో అక్షయ్ కుమార్ సినిమాల షూటింగ్ ల్లో మాత్రం రోజుల వ్యవధిలో వరసగా అనుకోని సంఘటనలు జరగడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. రీసెంట్ గా చిత్రబృందంలోని ఓ వ్యక్తికి ప్రమాదం జరగ్గా.. ఇప్పుడు ఏకంగా సదరు హీరోకే యాక్సిడెంట్ అయింది. ఇంతకీ ఏం జరిగింది? ప్రస్తుతం వాళ్లు ఎలా ఉన్నారు?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఏ సినిమా ఇండస్ట్రీ అయినా సరే ఫైట్, యాక్షన్ సీన్స్ చేసేటప్పుడు పలువురు హీరోలు డూప్స్ తో వాటిని పూర్తి చేస్తుంటారు. కొందరు హీరోలు మాత్రం తామే చేసేస్తుంటారు. తెలుగు హీరోల గురించి పక్కనబెడితే బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ ఈ బాపతే. స్వయంగా స్టంట్స్ చేస్తూ అభిమానులని ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తుంటాడు. కొన్నిరోజుల క్రితం.. అక్షయ్ హీరోగా చేస్తున్న ‘వేదాంత్ మరాఠీ వీర్ దౌడ్ సాత్’ మూవీ షూటింగ్ కొల్హాపూర్ లో జరిగింది. ఈ చిత్రబృందంలోని నగేష్ ఖోబరో అనే ఫొటోగ్రాఫర్ ప్రమాదవశాత్తూ 100 అడుగుల లోయలో పడిపోయాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి ఇంకా సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన మరవక ముందే ఇప్పుడు మరో షూటింగ్ లో అక్షయ్ గాయపడ్డాడు.
అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి నటిస్తున్న సినిమా ‘బడే మియాన్ చోటే మియాన్’. స్కాట్లాండ్ లో షూటింగ్ జరుగుతోంది. అక్షయ్, టైగర్ కలిసి యాక్షన్ సీన్స్ చేస్తున్నారు. ఓ స్టంట్ సీన్ తీస్తున్న టైంలో అక్షయ్ కు గాయాలయ్యాయట. అయితే అవి పెద్దవి కాకపోవడంతో వెంటనే షూటింగ్ లో పాల్గొని తన సీన్స్ అన్ని పూర్తి చేసేశాడట. తన వల్ల మళ్లీ షూటింగ్ ఆలస్యం కాకుడదని ఇలా చేశాడట. ప్రస్తుతానికి అయితే అక్షయ్ కు పెద్దగా ప్రమాదం ఏం లేదని తెలుస్తోంది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇలా రోజుల వ్యవధిలో రెండు షూటింగ్స్ లో వేర్వేరు ప్రమాదాలు జరగడంతో ఇండస్ట్రీలో వీటి గురించి, అదే టైంలో సేఫ్టీ విషయంలోనూ కాస్త జాగ్రత్తగా ఉండాలని మాట్లాడుకుంటున్నారు. మరి షూటింగ్ లో స్టార్ హీరో అక్షయ్ గాయపడటంపై మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.