బాలీవుడ్ లో ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో యాక్షన్ హీరోగా ఎదిగాడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుసగా సినిమాలు తీస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవల వరుస సినిమాలతో పలకరించిన అక్షయ్ కుమార్ తాజాగా ‘రక్షా బంధన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా ‘బాయ్‌కాట్ బాలీవుడ్’ అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ విషయంపై కామెంట్స్ చేశారు.
ఈ మద్య బాలీవుడ్ లో పలు సినిమాలు ‘బాయ్‌కాట్ బాలీవుడ్’ ట్యాగ్ తో సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది. ఇప్పటికే పలు చిత్రాలకు ఈ సెగ తగలగా ఈ మద్య రిలీజ్ అయిన ‘బ్రహ్మాస్త్రం’, ‘లాల్ సింగ్ చద్దా’, ‘డార్లింగ్స్’ చిత్రాలతో పాటు ప్రస్తుతం అక్షయ్ కుమార్ నటిస్తున్న ‘రక్షా బంధన్’ మూవీపై కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. రక్షా బంధన్ మూవీ ప్రమోషన్‌లో పాల్గొన్న అక్షయ్ కుమార్ బాయ్‌కాట్‌పై ట్రెండింగ్ పై మాట్లాడుతూ.. అమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చద్దా బాయ్‌కాట్’ విషయం తనను ఎంతగానో బాధించిందని అన్నారు.
బాలీవుడ్ లో బాయ్ కాట్ పేరుతో కొంత మంది విద్వేశంతో కూడుకున్నవాళ్లు చేసే అల్లరి పని.. ఇలాంటివి చేస్తే సోషల్ మీడియాలో తమకు గుర్తింపు వస్తుందని భ్రమలో ఉన్నారు. మన దేశంలో ప్రతి ఒక్కరికీ స్వేచ్చ ఉంటుంది.. కానీ దాన్ని దుర్వినియోగం చేయడం సబబు కాదు.. ఇలాంటి వాటితో దేశ ఆర్థిక వ్యవస్థకు ఏమైనా ఉపయోగం ఉంటుందా చెప్పండి? ప్రతి పౌరుడు దేశ గొప్పతనాన్ని చాటే విధంగా ప్రవర్తించాలి. అందుకోసం కృషి చేయాలి.. ఇలాంటి చిల్లరి పనులను ఇప్పటికైనా మానుకోవాలి అన్నారు అక్షయ్ కుమార్.