తెలుగు చలనచిత్ర రంగంలో మన్మథుడు అనగానే అందరికీ ముందుగా గుర్తుకి వచ్చే పేరు అక్కినేని నాగార్జున. అందంలో నాగ్ ని బీట్ చేయడం కుర్ర హీరోల వల్ల కూడా కాదు. లేటు వయసులో కూడా సరైన డైట్ ఫాలో అవుతూ ఫిట్ గా ఉండటం నాగార్జున స్పెషాలిటీ. అందంలో విషయంలో ఇంత కేరింగ్ గా ఉంటాడు కాబట్టే నాగార్జునకి అంతటి లేడీ ఫాలోయింగ్ సాధ్యం అయ్యింది.
ప్రస్తుతం నాగార్జున వయసు 61 సంవత్సరాలు. ఈ వయసులో కూడా ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటూ.., తనకి తానే సాటి అనిపించుకుంటున్నాడు మన కింగ్. కానీ.., నాగ్ మాత్రం ఎప్పుడు విత్ ఔట్ మేకప్.. కెమెరా ముందుకి వచ్చింది లేదు. 6 పదులు దాటిన తాను అసలు రూపంతో కెమెరా ముందుకి వస్తే ఫ్యాన్స్ హార్ట్ అవుతారన్నది ఆయన ఆలోచన. కానీ.., అన్నమయ్య సినిమాలో ఒకసారి, బిగ్ బాస్-4 ప్రోమో కోసం ఒకసారి నాగార్జున ముసలి వేషంలో కనిపించాడు. అవి కాన్సెప్ట్ లో భాగం కాబట్టి తప్పలేదు. కానీ.., ఇప్పుడు మొదటి నాగార్జున మేకప్ లేకుండా ఉండే పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎప్పుడో తెలియదు గాని.., ఓ అమ్మాయితో నాగార్జున సెల్ఫీ దిగారు. ఇందులో నాగ్ పూర్తిగా నెరిసిన జుట్టు, మీసకట్టుతో కనిపించడం అందరికి షాక్ ఇస్తుంది. మేకప్ లేకుంటే మన కింగ్ నాగ్ ఇలా ఉంటారా అని ఫ్యాన్స్ తెగ ఆశ్చర్యపోతున్నారు. అయితే.., ఈ పిక్ ని ఎవరు లీక్ చేశారన్న విషయం మాత్రం బయటకి రాలేదు. ఇక నాగార్జున ఇటీవల `వైల్డ్ డాగ్`తో ప్రేక్షకుల ముందుకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నాగ్..ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే ‘బంగార్రాజు’తో పాటు మరో సినిమాని లైన్‌లో పెట్టినట్టు తెలుస్తోంది. వీటన్నటికి తోడు బిగ్ బాస్ షో ఎలా ఉండనే ఉంది. ఈ లెక్కన కుర్ర హీరోలకన్నా నాగార్జునే కెరీర్ స్పీడ్ చూపిస్తున్నట్టు అర్ధం అవుతోంది. సో మన మన్మథుడి విషయంలో ఎప్పటికైనా ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అంతే.