చాలా కాలం క్రితమే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. కానీ, ఇప్పటి వరకూ ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా అందుకోలేకపోయాడు. అయినప్పటికీ వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అఖిల్ ‘ఏజెంట్’ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఓ సూపర్ స్టార్ తప్పుకున్నట్లు న్యూస్ వైరల్ అవుతోంది. అంతేకాదు, ఆయన స్థానంలో తెలుగు హీరో ఎంట్రీ ఇచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఏం జరిగింది?
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ నటించిన చిత్రమే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్నా కరోనా కారణంగా ఇంకా విడుదల కాలేదు. అక్కినేని అఖిల్ సురేందర్ రెడ్డితో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ‘ఏజెంట్’లో అక్కినేని అఖిల్ రా ఏజెంట్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.
‘ఏజెంట్’ సినిమా కోసం పరిశీలించిన జాబితా నుంచి మమ్ముట్టి పేరును తొలగించినట్లు ఓ న్యూస్ బయటకొచ్చింది. ‘ఏజెంట్’ మూవీలో మమ్ముట్టితో చేయించాలనుకున్న పాత్ర కోసం అక్కినేని నాగార్జునను తీసుకోబోతున్నట్లు తెలిసింది. ఇప్పటికే దీనికి ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసిందని అంటున్నారు. కొడుక్కు ఎలాగైనా హిట్ ఇవ్వాలన్న లక్ష్యంతోనే నెగెటివ్ షేడ్స్ ఉన్న ఈ పాత్రకు నాగ్ ఒప్పుకున్నారని తెలిసింది. ఇది ఒక రకంగా సాహసమనే చెప్పాలి.
ఇటీవలే అతడి బాడీని చూపిస్తూ రెండు పోస్టర్లను విడుదల చేశారు. అలాగే, షూటింగ్‌ను కూడా గ్రాండ్‌గానే మొదలు పెట్టేసింది యూనిట్. గత వారమే ‘ఏజెంట్’ మూవీ షూటింగ్ అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. ఇందులో హీరోపై ఇంట్రడక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. అదే సమయంలో మిగిలిన నటీనటుల వివరాలు కూడా త్వరలోనే వెల్లడించబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.