తెలుగు ఇండస్ట్రీలో విలన్ గా కెరీర్ ఆరంభించి టాప్ హీరోలుగా ఎదిగిన వారు ఎంతో మంది ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో కొన్ని చిత్రాల్లో విలన్ గా నటించిన విషయం తెలిసిందే. శ్రీకాంత్, గోపిచంద్ ఇలా కొంతమంది హీరోలు కెరీర్ బిగినింగ్ లో విలన్ పాత్రల్లో నటించారు. ప్రస్తుతం రానా, కార్తికేయ, ఆదిపినిశెట్టి లాంటి వారు హీరోలుగా నటిస్తూనే విలన్ అవతారం ఎత్తుతున్నారు.
ఇక దగ్గుబాటి హీరో రానా ఎలాంటి పాత్రలకైనా సిద్దం అన్నట్టు తన కెరీర్ కొనసాగిస్తున్నారు. బాహుబలి సినిమాతోపాటు ఓ బాలీవుడ్ సినిమాలో విలన్‌గా మెప్పించిన రానా.. భీమ్లా నాయక్ కోసం కూడా విలన్‌గా మారాడు. ఇందులో డానియల్ శేఖర్ అనే నెగెటివ్ పాత్రలో నటిస్తున్నాడు. ఇదే కోవలోకి వస్తాడు తమిళ నటుడు విజయ్ సేతుపతి. తాజాగా ఈ జాబితాలో మరో హీరో చేరబోతున్నాడు. అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘లవ్ స్టోరీ’ విడుదలకు సిద్దం అయ్యింది.
ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ పలు టివి ఛానల్స్ కి తెగ ఇంటర్వ్యూలో ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగ చైతన్య అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ఓ హారర్ వెబ్ సిరీస్ లో నటించబోతున్నట్టు రివీల్ చేశారు. అందులో తను నెగెటివ్ రోల్ పోషిస్తున్నట్టు కూడా చెప్పారు. ఈ వెబ్ సీరీస్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించబోతున్నారట. గతంలో విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అక్కినేని ఫ్యామిలీ మొత్తం నటించిన ‘మనం’ సూపర్ హిట్ అయ్యింది. విక్రమ్ ఇప్పుడు చైతూతో కలిసి థ్యాంక్స్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.