అక్కినేని నాగచైతన్య త్వరలో 'కస్టడీ' సినిమాతో ప్రేక్షకులకు ముందుకు రానున్నారు. మే 12న ఈ సినిమా విడుదలవుతోంది. ఇది తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం. ప్రస్తుతం సినిమాను ప్రమోట్ చేసే పనిలో నాగచైతన్య బిజీగా ఉన్నారు.
“కింగ్” నాగార్జున కొడుగా ఇండస్ట్రీలోకి వచ్చిన నాగ చైతన్య.. తనదైన నటతో ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. జోష్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికి అంత గుర్తింపు రాలేదు. ఆ తరువాత సమంతతో కలిసి నటించిన ఏ మాయ చేసావే సినిమా ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. అలానే ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందుతూ దూసుకెళ్తున్నాడు. తాజాగా ఆయన నటించిన “కస్టడి” సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీబిజీగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతూ.. ఓ డైరెక్ట గురించి ప్రస్తావిస్తూ.. ఆయన గురించి మాట్లాడం, ఆలోచించడం టైమ్ వేస్టూ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
అక్కినేని నాగచైతన్య, కన్నడ భామ కృతిశెట్టి జంటగా నటించిన తాజా చిత్రం ‘కస్టడి’. వెంకట ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 12 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం. అలానే ఈ సినిమాతో చైతూ కోలివుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టనున్నాడు. ఈ సినిమా కోసం అక్కినేని అభిమానులతో పాటు సినీ ప్రియులు అందరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక మూవీ టీమ్ ప్రమోషన్లతో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. అలానే హీరో నాగచైతన్య కూడా వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు.
అయితే ఇటీవలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతూ.. డైరెక్టర్ పరశురామ్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. పరశురామ్ తో మీకు ఏంటి సమస్య? అనే ప్రశ్న జర్నలిస్ట్ నుంచి నాగచైత్యనకు ఎదురైంది. ఇక చైతూ.. పరశురామ్ పేరు ప్రస్తావించకుండానే.. ఆయన గురించి మాట్లాడండం టైమ్ వేస్ట్ అంటూ సమాధానం ఇచ్చాడు. “ఆయన నా టైమ్ వృథా చేశారు. ఆయన గురించి ఇప్పుడు మాట్లాడం మీ టైమ్ వేస్టు, నా టైమ్ వేస్టు. అందుకే ప్రత్యేకించి కారణాలు అంటూ ఏమి లేవు. మీకు అన్ని తెలిసే ఉంటాయి” అంటూ నాగ చైతన్య అన్నారు. అయితే నాగ చైతన్య చేసిన ఈ వ్యాఖ్యలపైలు చర్చలు జరుగుతున్నాయి.
గతంలో నాగచైతన్యతో డైరెక్టర్ పరశురాం సినిమా చేస్తున్నారని.. కిందటేడాది వార్తలు వచ్చాయి. అయితే అనూహ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘సర్కారు వారి పాట’ సినిమాకు ఛాన్స్ రావడంతో నాగచైతన్య ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేసి పరశురాం వెళ్లిపోయారంట. అయితే, ఈ సినిమా తరువాత మళ్లీ చైతూ దగ్గరకు పరశురాం వెళ్లారని.. ‘నాగేశ్వరరావు’ అనే టైటిల్‌తో సినిమాను పట్టాలెక్కిస్తున్నారని టాక్. కానీ, పరశురాం చెప్పిన కథ నాగచైతన్యకు నచ్చకపోవడంతో ప్రాజెక్ట్ రద్దు చేసుకున్నారని వార్తలు వచ్చాయి. ఇలాంటి సమయంలో మరోసారి నాగ చైతన్య పరశురామ్ పై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. మరి.. నాగ చైతన్య చేసిన వాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.