పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ కి సినిమాల్లోకి రాకుండానే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అకీరాకి సంబంధించి ఏ చిన్న విషయమైనా తల్లి రేణుదేశాయ్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటుంది. ముఖ్యంగా అకీరా గురించి ఏ చిన్న అప్ డేట్ తెలిసినా.. మెగా ఫ్యాన్స్ చేసే సందడి అంతా ఇంతా కాదు. అయితే.. తాజాగా అకిరా ఇంటర్మీడియెట్ ఫేర్ వెల్ సెలబ్రేషన్స్ సందర్భంగా దిగిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదివరకే అకీరా బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో చూశాం.. ఇటీవలే పియానో వాయిస్తున్న వీడియో కూడా చూశాం. కానీ తాజా ఫోటోలలో అకీరా ఇంటర్ స్కూలింగ్ పిక్స్ లో స్టైలిష్ గా కనిపించేసరికి ఫ్యాన్స్ అంతా ఖుషి అవుతున్నారు. అయితే.. అకీరా హైదరాబాద్ లోని ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ లో 12వ తరగతి పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే స్కూలింగ్ పూర్తయిన సందర్భంగా ఫేర్ వెల్ లాంటిది ఏర్పాటు చేసారని సమాచారం. ఈ ఫేర్ వెల్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా రావాడం విశేషం.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అకీరా తన ఫ్రెండ్స్ తో పాటు తన తండ్రి పవన్ కళ్యాణ్, తల్లి రేణుదేశాయ్, చెల్లి ఆధ్యలతో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఈ విషయం పక్కన పెడితే.. అకీరాకు సంబంధించి మెగా ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ అంతా పవన్ కి నటవారసుడిగా సినీ ఎంట్రీ చేస్తాడని భావిస్తున్నారు. కానీ తల్లి రేణుదేశాయ్ వెర్షన్ లో మాత్రం అకీరాకు యాక్టింగ్ ఇంటరెస్ట్ లేదని చాలా నమ్మకంగా చెబుతోంది. మరి చివరిగా అకీరా ఏం చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. మరి అకీరా గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Akira Nandan and @PawanKalyan at INDUS INTERNATIONAL SCHOOL. pic.twitter.com/WCoX3rTIsk
— ✒ త్రివిక్రమ్ ᶠᵃⁿ✍️ (@Harinani_) May 23, 2022