సినీ రంగంలో హీరోలు కండలు తిరిగిన దేహంతో సిక్స్ ప్యాక్ చూపించడమనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. నిజానికి సినిమాకోసం దేహదారుఢ్య ప్రదర్శన చేస్తున్న హీరోలు ఎప్పటినుండో కంటిన్యూ అవుతున్నారు. ఒకప్పుడు హీరోలు సిక్స్ ప్యాక్ చూపించారంటే అభిమానులు ఓ రేంజిలో థ్రిల్ అయ్యేవారు. కానీ నేటి జనరేషన్ హీరోలు సిక్స్ ప్యాక్ చూపిస్తే పెద్దగా థ్రిల్ అవ్వాల్సిన అవసరం లేదంటున్నారు. ఎందుకంటే సిక్స్ ప్యాక్ అనేది ఈ మధ్యకాలంలో కామన్ అయిపోయింది.
కానీ ఇంతవరకు సిక్స్ ప్యాక్ చూపించని హీరోలు ధైర్యం చేస్తే మాత్రం ఫ్యాన్స్ కి థ్రిల్ కలిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అదే ఆలోచనను ప్రాక్టికల్ గా ఫాలో అవుతున్నాడు యువహీరో అక్కినేని అఖిల్. ఇటీవలే అఖిల్ నుండి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం అఖిల్ తదుపరి సినిమా పై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో’ఏజెంట్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ప్రొడ్యూసర్ అనిల్ సుంకర నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ పవర్ ఫుల్ యాక్షన్ మూవీ.. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో అఖిల్ బర్త్ డే రోజున లాంచనంగా ప్రారంభమైంది. అయితే.. అక్కినేని అఖిల్, సురేందర్ రెడ్డి సినిమా కోసం సిక్స్ ప్యాక్ బాడీతో దర్శనం ఇవ్వనున్నాడు. దాదాపు 40కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమా అనౌన్స్ చేసి పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఒకటి షర్ట్ లేకుండా అఖిల్ సిక్స్ ప్యాక్ లో కనిపించడం ఆల్రెడీ అయిపోయింది. తాజాగా అఖిల్ వర్కౌట్స్ చేస్తూ దిగిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో అఖిల్ కండలు తిరిగిన దేహంతో మాన్స్టర్ లా కనిపిస్తున్నాడు. అఖిల్ బాడీ చూస్తే అర్ధమవుతుంది. తాను ఈ ఏజెంట్ సినిమాకోసం ఎంతలా కష్టపడుతున్నాడో. ప్రస్తుతం అఖిల్ పిక్ అక్కినేని ఫాన్స్ కి ట్రీట్ ఇస్తుందనే చెప్పాలి. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ కాగా స్టార్ యాక్టర్ మమ్ముట్టి కీలకపాత్రలో నటిస్తున్నాడు. మరి అఖిల్ డెడికేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.