అఖిల్ ఫ్యాన్ మళ్లీ రెచ్చిపోయాడు. ఈసారి మాస్ డ్యాన్స్ తో కేక పుట్టించాడు. ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది. ఇంతకీ ఏంటి విషయం?
హీరో అఖిల్ పేరు చెప్పగానే అందరికీ అతడి సినిమాల కంటే ఓ అభిమాని గుర్తొస్తాడు. అతడి పేరు ఎవరికీ పెద్దగా తెలియదు గానీ అతడెలా మాట్లాడుతాడో ఇమిటేట్ చూపిస్తారు. ‘అఖిలే గొప్ప’, ‘కింగ్ కొడుకు’, ‘అయ్యగారు నంబర్ వన్’.. ఈ పదాలకు సృష్టికర్త ఆ ఫ్యాన్. తాజాగా అఖిల్ ‘ఏజెంట్’ ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. ఈ సందర్భంగా ఓ థియేటర్ ముందు డ్యాన్స్ తో రచ్చ చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది. ఇంతకీ ఏం జరిగింది?
అసలు విషయానికొస్తే.. అందరు హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు. కానీ వాళ్ల గురించి ఎవరికీ తెలియదు. కానీ అక్కినేని అఖిల్ పేరు చెప్పగానే ఓ వ్యక్తి మన మైండ్ లోకి వస్తాడు. నాగరాజు అని పేరున్న ఆ వ్యక్తి.. ఓ నాలుగైదేళ్ల క్రితం అఖిల్ మూవీ రిలీజ్ సందర్భంగా ఫేమస్ అయ్యాడు. అప్పటినుంచి అఖిల్ గురించి టాపిక్ వచ్చిన ప్రతిసారి న్యూస్ లో హాట్ టాపిక్ అవుతుంటాడు. ఇప్పుడు ‘ఏజెంట్’ రిలీజ్ సందర్భంగానూ మనోడు డ్యాన్స్ తో రచ్చ రచ్చ చేశాడు. మీరు ఆ వీడియోపై లుక్కేయండి.
‘ఏజెంట్’ మూవీ విషయానికొస్తే.. రిలీజ్ కు కొంతమేర బజ్ క్రియేట్ చేసింది. కానీ మార్నింగ్ షో తర్వాత టాక్ పూర్తిగా బయటకొచ్చేసింది. అఖిల్ కష్టం వృథా అయిందని అంటున్నారు. సినిమా అంతా చాలా డల్ గా ఉందని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం మిక్స్ డ్ రివ్యూస్ వస్తున్నాయి గానీ ఈ వీకెండ్ పూర్తయి, కలెక్షన్ నంబర్స్ వస్తే అసలు టాక్ ఏంటనేది బయటకొస్తుంది. సరే ఇదంతా పక్కనబెడితే ‘ఏజెంట్’ థియేటర్ ముందు అయ్యగారు ఫ్యాన్ డాన్స్ చూసిన తర్వాత మీకేం అనిపించింది. కింద కామెంట్ చేయండి.