తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు తనయుడు అక్కినేని నాగార్జున వారసులుగా నాగ చైతన్య, అఖిల్ లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. జోష్ చిత్రంతో హీరోగా అక్కినేని నాగ చైతన్య ఎంట్రీ ఇచ్చాడు. ఇక అఖిల్ చిత్రంలో అక్కినేని అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమా పెద్దగా విజయం సాధించకున్నా.. హీరోగా అఖిల్ డ్యాన్స్, ఫైట్స్ విషయంలో ఫ్యాన్స్ ని మెప్పించాడు. ఆ తర్వాత రిలీజ్ అయిన చిత్రలు కూడా పెద్దగా సక్సెస్ ను అందుకోలేకపోయాడు అఖిల్. ఇటీవల కాలంలో అక్కినేని ఫ్యామిలీ విషయం సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది.
మోస్ట్ లవబుల్ కపుల్ నాగ చైతన్య-సమంత విడాకుల విషయం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో అఖిల్ నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ సినిమా దసరా కానుకగా ఆడియన్స్ ముందుకు రానుంది. తెలుగు ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోగా ఎదగడానికి ప్రతి సినిమా విషయంలో అఖిల్ ఎంతో కష్టపడుతున్నట్లు సన్నిహితులు., కుటుంబ సభ్యుల చెబుతూనే ఉన్నారు. ప్రస్తుతం అఖిల్ నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’చిత్ర ప్రమోషన్ లో తెగ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే కొంత మంది అమ్మాయిలతో అఖిల్ చేసిన సందడి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’చిత్ర ప్రమోషన్ భాగంగా లేడీ ఫ్యాన్స్ ని కలిశాడు అఖిల్. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ చిత్ర విషయాల గురించి చర్చించాడు.
ఇక అక్కడ ఉన్న అమ్మాయిలు ఈ చిత్రంలో పాటలు చాలా బాగా నచ్చాయని.. అందులో ఏ పాట నచ్చిందని అఖిల్ అడిగారు.. అందరూ లెహరాయీ.. లెహరాయీ అనే పాట చాలా బాగా నచ్చిందని అన్నారు. దానికి అఖిల్ మాట్లాడుతూ.. అసలు నేను ఊహించలేదని.. ఈ పాట ఇంత సూపర్ హిట్ అవుతుందని అనుకోలేదని అన్నారు. తనకు ఏ జిందగీ బాగా నచ్చిందని.. లెహరాయి పాట రిలీజ్ చేస్తున్నప్పుడు ఈ పాట సక్సెస్ అవుతుందా లేదా అన్న డౌట్ ఉందని.. కానీ అందరికీ ఈ పాటనే బాగా నచ్చిందని అన్నారు. తర్వాత అందరు అమ్మాయిలు ఈ పాటకు మీతో డ్యాన్స్ చేయాలని అడిగారు.
అందరితో కాదు.. నాకు ఒక్క పార్ట్ నర్ కావాలని అన్నారు. అయితే తాను రౌండ్స్ తిరుగుతానని.. ఎక్కడ ఎండ్ అయితే అక్కడ ఉన్న అమ్మాయితో డ్యాన్స్ చేస్తానని అన్నాడు. అలా అఖిల్ ఓ అమ్మాయిని సెలక్ట్ చేసుకొని ఆమెతో లహరాయీ.. లహరాయీ అనే పాటకు డ్యాన్స్ చేశాడు. ఆ లేడీ ఫ్యాన్స్ కూడా అఖిల్ తో డ్యాన్స్ చేస్తున్నంత సేపు తన్మయత్వంలో మునిగిపోయి.. తెగ ఎంజాయ్ చేసింది. అయితే అఖిల్ డ్యాన్స్ చేసిన అమ్మాయి ఎవరా అని ఫ్యాన్స్ గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.