హీరో అఖిల్ అక్కినేని.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అఖిల్ ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అన్నాడు.. అసలు ఏం జరిగిందో తెలియాలంటే.. ఇది చదవండి.
కుటుంబం, బంధాల గురించి అక్కినేని హీరో అఖిల్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కుటుంబం అన్నాక గొడవలు పడరా.. తిట్టుకోరా అంటూ అక్కినేని అఖిల్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరి అఖిల్ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడు.. తన ఇంట్లో పరిస్థితి గురించే ఈ వ్యాఖ్యలు చేశాడా అంటూ జోరుగా చర్చించుకుంటున్నారు జనాలు. ఇంతకు అఖిల్ అన్న మాటలు ఎవరిని ఉద్దేశించి చేశాడు.. ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చిందో తెలియాలంటే..
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా ‘ఏజెంట్’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా.. ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీనిలో అఖిల్ సరసన.. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా విడుదల దగ్గర పడుతుండటంతో మేకర్స్ ఏజెంట్ సినిమా గురించి పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సినిమా విడుదల ఎందుకు లేటయ్యింది అనే ప్రశ్నకు హీరో అఖిల్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి స్పందించారు.
ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ.. ‘‘ఏజెంట్ సినిమా ఆగిపోయింది.. దర్శకుడు సురేందర్ రెడ్డికి కోపం వచ్చి షూటింగ్ నుంచి వెళ్లిపోయాడు.. వంటి వార్తలు చాలా రాసుకొచ్చారు. మేం అదే రోజు ఈ షాట్ ఇరగదీశం అని అనుకునే సమయంలో ఇలాంటి వార్తలు మా దృష్టికి వచ్చేవి. వాటిని చూసి మేం నవ్వుకునేవాళ్లం. ఏజెంట్ సినిమా రెండేళ్ల ప్రయాణం. ఈ రెండు సంవత్సరాల ప్రయాణంలో టీమ్‌లో ఒత్తిడి ఉండదంటారా. మన ఫ్యామిలీ అన్నాక గొడవలు రావా.. కుటుంబ సభ్యులు ఒకరినొకరు తిట్టుకోరా.. అలాగే మా టీమ్‌లోనూ జరిగాయి. తిట్టుకోవటం అంటే తిట్టుకోవటం కాదు.. ఇంతకు ముందు చెప్పినట్లు స్ట్రెస్ ఉండింది. అయితే ఈ జర్నీని మేం ప్రతీ క్షణం ఎంజాయ్ చేశాం’’ అని చెప్పుకొచ్చారు.
ఇదే ప్రశ్నలపై దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా స్పందించారు. ‘‘ఏజెంట్ సినిమా రెండేళ్ల కష్టం. అందులో ఏడాది సమయం కరోనాతో వేస్ట్ అయిపోయింది. ఆ తర్వాత కోవిడ్ కారణంగా నేను ఆరు నెలలు ఆస్పత్రిలోనే ఉన్నాను. అది కూడా బుడాపెస్ట్‌లో. దాదాపు ఏడాదిన్నర సమయం అలా వేస్ట్ అయ్యింది. నేను వెళ్లిపోయి వచ్చాను. సినిమా కోసం మేం ఇంత కష్టపడితే లేట్ అయ్యిందని అంటున్నారు. చెప్పకూడని సమస్యలెన్నో మా సినిమాకు వచ్చాయి. ఏజెంట్ సినిమా కోసం మేం కష్టపడింది కేవలం 100 రోజులు మాత్రమే. బుడాపెస్ట్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు నాకు కరోనా వచ్చింది. 20 రోజులు నేను వెంటిలేటర్‌పైనే ఉన్నాను. ఈ విషయాలు ఎవరికీ తెలియవు. నన్ను టీమ్ ఎలా కాపాడుకుని ఇక్కడకు తీసుకొచ్చిందో మాకు తెలుసు’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ప్రసుత్తం వీరి వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.