నందమూరి నట సింహం బాలయ్య నటించిన, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన మాస్ చిత్రం అఖండ. ఈ అఖండ చిత్రం ఎంతటి అఖండమైన విజయం అందుకుందో వేరే చెప్పనక్కర్లేదు. సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు అఖండ ఓ సంచలనంగా మారింది. రాబోయే పెద్ద చిత్రాలకు అఖండ ఓ భరోసాని కల్పించింది. మంచి సినిమా తీస్తే ఎలాంటి సమయంలోనైనా ప్రేక్షకుల ఆదర్శిస్తారని అఖండ సినిమా నిరూపించింది.
ఇదిలా ఉండగా..అఖండ మూవీ డిజిటల్ రిలీజ్ ఎప్పుడుంటుంది అనే ఆసక్తి చాలా మందిలో ఉంది. థియేటర్ లో విడుదలైన చిత్రాలాకు సంబంధించి ఓటీటీ రిలీజ్ చేసుకోవాటానికి ఓ అగ్రిమెంట్ ఉందని సమాచారం. దాని ప్రకారమే అఖండ మూవీ ఓటీటీలో రీలీజ్ కావచ్చని తెలుస్తోంది.
నిజానికి “అఖండ” డిజిటల్ రిలీజ్ ఎప్పుడుంటుంది అనే ఆసక్తి చాలా మందిలో ప్రేక్షకులో ఉంది. ఈ చిత్రం విడుదలైన 30 రోజుల తర్వాత ఓటీటీ రిలీజ్ చేసుకోవాలనేది అగ్రిమెంట్ లో ఉన్నట్లు సమాచారం.ఆ సమాచారమే నిజమైతే.. జనవరి 1 లేదా 2న “అఖండ” మూవీ ఓటీటీ లో విడుదల ఉంటుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో “అఖండ” స్ట్రీమ్ కానున్నట్లు సమాచారం. డిసెంబర్ చివరి వారంలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరి ఓటీటీల్లో కూడా ఈ చిత్రం ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి. ఓటీటీలో అఖండ రిలీజ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#Akhanda to stream on this OTT platform soon#Balakrishna #BlockbusterAkhanda#AkhandaMassJathara #OTTNews https://t.co/NRcZ9ptdAM
— TrackTollywood (@TrackTwood) December 7, 2021