నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కి బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసిన లేటెస్ట్ మూవీ అఖండ. సింహా, లెజెండ్ సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా కావడం విశేషం. భారీ అంచనాల మధ్య 2021 డిసెంబర్ 2న విడుదలైన అఖండ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది.
బాలయ్య, బోయపాటిల బ్లాక్ బస్టర్ కాంబినేషన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర రిపీట్ చేసింది. అలాగే బాలయ్య కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు(200కోట్లు గ్రాస్) సాధించిన చిత్రంగా అఖండ నిలవడం మరో విశేషం. చాలా గ్యాప్ తర్వాత బాలయ్యను అఖండ మూవీ ఫామ్ లోకి తీసుకొచ్చింది. ఈ సినిమాలో ప్రగ్యాజైస్వాల్ హీరోయిన్ గా నటించింది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. అయితే.. ఇటీవలే 50రోజులు పూర్తి చేసుకున్న అఖండ మూవీ.. జనవరి 21న ఓటిటి రిలీజ్ అయింది.డిస్నీప్లస్ హాట్ స్టార్ లో విడుదలైన అఖండ.. మొదటిరోజే OTT రికార్డు నమోదు చేసింది. స్ట్రీమింగ్ మొదలైన 24 గంటల్లో 1 మిలియన్ వ్యూయర్ షిప్ దక్కించుకొని, అఖండ హాట్ స్టార్ చరిత్రలో కూడా అఖండమైన విజయాన్ని సెట్ చేసిందని సమాచారం. అదీగాక డిస్నీ హాట్ స్టార్ లో విడుదలైన తెలుగు సినిమాల్లో 1 మిలియన్(24 గంటల్లో) రికార్డు అఖండకే దక్కిందని ఇండస్ట్రీ టాక్. మొత్తానికి బాలయ్య అఖండ సెన్సేషన్ ఓటిటిలో కూడా రికార్డుతోనే మొదలైందని నందమూరి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. మరి బాలయ్య అఖండ కొత్త రికార్డు పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.