పోలీసుల ప్రముఖ సింగర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే సీసీటీవీ దృశ్యాలు కేసులో కీలకంగా మారాయి. చనిపోవటానికి కొన్ని నిమిషాల ముందు ఆమె ఓ వ్యక్తితో ఉన్న దృశ్యాలు అందులో ఉన్నాయి.
ప్రముఖ నటి ఆకాంక్ష దూబె అనుమానస్పద మృతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న నిందితుడు సమర్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని కోర్డు ముందు హాజరుపరిచారు. ఈ నేపథ్యంలోనే ఆకాంక్ష మృతికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. భోజ్‌పురి నటి ఆకాంక్ష ఓ సినిమా షూటింగ్ కోసం వారణాసి వెళ్లారు. అక్కడి ఓ హోటల్‌లో ఉంటూ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె తన హోటల్ గదిలో అనుమానాస్పదంగా మృత్యువాతపడ్డారు.
సమచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో హోటల్‌లోని సీసీటీవీ దృశ్యాలు కీలకంగా మారాయి. చనిపోవటానికి కొన్ని నిమిషాల ముందు ఆకాంక్ష ఓ గుర్తు తెలియని వ్యక్తితో హోటల్ లాబీలో మాట్లాడుతూ ఉంది. ఇది జరిగిన కొన్ని నిమిషాల తర్వాత ఆమె తన గదిలోకి వెళ్లారు. మరుసటి రోజు శవమై తేలారు. సీసీటీవీలో ఆకాంక్షతో పాటు కనిపించిన ఆ వ్యక్తి ఎవరో తెలియరాలేదు. ఆ వ్యక్తి ఎవరు? ఆ సమయంలో అతడు ఆకాంక్షతో ఏం మాట్లాడాడు?
ఆకాంక్ష మరణంతో అతడికి ఏదైనా సంబంధం ఉందా? అన్న కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. ఇక, ఆకాంక్ష మరణం హత్య అని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రముఖ సింగర్ సమర్ సింగ్ హస్తం ఉందని వారు ఆరోపిస్తున్నారు. కాగా, ఆకాంక్ష సింగ్ నటిగా భోజ్‌పురి చిత్ర పరిశ్రమలో ఇప్పుడిప్పుడే మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఆమెకు సమర్ సింగ్ అనే సింగర్‌తో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. వారణాసిలోని హోటల్‌లో మార్చి 26న అనుమానాస్పదంగా మృతి చెందారు. మరి, ఆకాంక్ష దూబె అనుమానాస్పద మృతిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.