కొన్ని రోజుల క్రితం సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసులో అరెస్ట్ అయిన పని మనిషి ఈశ్వరి విచారణలో వెల్లడించిన విషయాలు చూస్తే మతిపోతోంది. తాను అసలు దొంగతనం చేయడానికి కారణం ఐశ్వర్యే అంటూ చెప్పుకొచ్చింది.
కొన్ని రోజుల క్రితం సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఇంట్లోని సుమారు 60 సవర్ల బంగారు నగలు చోరీకి గురైయ్యాయి అని ఐశ్వర్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసులో ఇంట్లోని పని మనిషి అయిన ఈశ్వరిని అరెస్ట్ చేసిన విషయం కూడా తెలిసిందే. అయితే అరెస్ట్ అయిన ఈశ్వరి విచారణలో వెల్లడించిన విషయాలు చూస్తే మతిపోతోంది. ఇప్పటికే తనకు రెండు ఇల్లులు ఉన్నాయి అంటూ.. తాను అసలు దొంగతనం చేయడానికి కారణం ఐశ్వర్యే అంటూ షాకింగ్ విషయాలు వెల్లడించింది. మరి దొంగతనం చేయడానికి ఐశ్వర్య ఎందుకు కారణం అయ్యిందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐశ్వర్య రజనీకాంత్.. సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురిగా.. హీరో ధనుష్ భార్యగా అందరికి సుపరిచితురాలే. అదీకాక ఆమె దర్శకురాలిగా మారి మూడు సినిమాలు సైతం తెరకెక్కించింది. ఇక తాజాగా ఐశ్వర్య ఇంట్లో భారీ చోరీ జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఈ చోరీ కేసులో ఇంటి పని మనిషి ఈశ్వరిని నిందితురాలిగా గుర్తించిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో దొంగతం తనే చేసినట్లుగా అంగీకరించింది ఈశ్వరి. ఇక దొంగతనం ఎందుకు చేశావని పోలీసులు ప్రశ్నించగా.. విస్తుపోయే విషయాలు వెల్లడించింది. తాను ఈ ఇంట్లో గొడ్డులా పనిచేస్తున్నానని, అయినా గానీ తనకు రూ. 30 వేలే జీతం ఇస్తున్నారని అన్నది. ఆ జీతం తన కుటుంబం గడవడానికి సరిపోట్లేదని, అందుకే దొంగతనం చేశానని ఈశ్వరి చెప్పుకొచ్చింది.
ఇక నేను దొంగతనం చేయడానికి ఒక విధంగా ఐశ్వర్యే కారణం అంటూ బాంబు పేల్చింది పని మనిషి ఈశ్వరి. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే? ఈశ్వరి ఇంట్లో ఐశ్వర్య ఇంట్లో పోయిన నగల కంటే ఎక్కువ నగలు దొరికాయి. ఆమె ఇంట్లో 100 సవర్ల నగలు, 4 కేజీల వెండి, 30 గ్రాముల వజ్రాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాంతో ఈ నగలు ఎక్కడివి అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈశ్వరి ఐశ్వర్య ఇంటితో పాటుగా ధనుష్, రజనీకాంత్ ఇంట్లో కూడా పనిచేసిందని తేలింది. దాంతో ఆ నగలు ఆ ఇళ్లలో దొంగిలించిందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు