ఆమె పుట్టి పెరిగింది కర్ణాటకలో. కానీ ఇప్పుడు మాత్రం పాన్ ఇండియా హీరోయిన్. ఆమె కళ్లు చూస్తే కుర్రాళ్లు ఫుల్ ఫిదా అయిపోతారు. అప్పుడెప్పుడో 1997లో మొదలైన ఆమె కెరీర్ ఇప్పటికీ అద్భుతంగా సాగుతోంది. రీసెంట్ ఆమె చేసిన ఓ పాన్ ఇండియా మూవీ.. ప్రేక్షకుల ముందుకొచ్చింది. అందులో ఆమె అందం చూసిన ఫ్యాన్స్.. వాహ్ అంటుంటే, కొందరు హీరోయిన్లు మాత్రం కుళ్లుకుంటున్నారు. ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమె చిన్నప్పటి ఫొటోస్ కొన్ని వైరల్ గా మారాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ఐశ్వర్యరాయ్. 1973 నవంబరు 1న, కర్ణాటక మంగుళూరులో ఈమె పుట్టింది. చదువు పూర్తి కావడం, తండ్రి చనిపోవడంతో ఐశ్వర్య ఫ్యామిలీ.. ముంబయికి షిప్ట్ అయిపోయారు. 1993లో ఐశ్వర్య చేసిన పెప్సీ యాడ్ సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఏడాది అంటే 1994 మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని రెండో స్థానంతో సరిపెట్టుకుంది. అదే ఇయర్ జరిగిన మిస్ వరల్డ్ తో పాటు పలు టైటిల్స్ దక్కించుకుని ఎనలేని కీర్తి సంపాదించింది. ఆ తర్వాత సినిమాల్లో ఛాన్స్ వచ్చే వరకు మోడలింగ్ కెరీర్ ని కొనసాగించింది.
1997లో డైరెక్టర్ మణిరత్నం తీసిన ఇరువుర్(ఇద్దరు) మూవీతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది. అప్పటి నుంచి మొన్న వచ్చిన ‘పొన్నియన్ సెల్వం’ వరకు ఐదు భాషల్లో మొత్తంగా 47 సినిమాలు చేసింది. తెలుగులోనూ ‘రావోయి చందమామ’లో ఐశ్వర్య కథానాయికగా చేసింది. ఇక ఐశ్వర్య.. సల్మాన్ ఖాన్, వివేక్ ఒబెరాయ్ లాంటి హీరోలతో డేటింగ్ చేసినట్లు వార్తలొచ్చాయి. 2007లో హీరో అభిషేక్ బచ్చన్ ని పెళ్లి చేసుకుని.. బచ్చన్ ఇంటికి కోడలిగా వెళ్లింది. అభిషేక్-ఐశ్వర్య దంపతులకు ఆరాధ్య అనే అమ్మాయి కూడా ఉంది. ప్రపంచంలోనే అత్యంత అందమైన వారిలో ఐశ్వర్యారాయ్ ఒకరు!