స్టార్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్‌కు ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉత్తరాదినే కాదు దక్షిణాదిలోనూ ఆమె లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. అలాంటి ఐష్‌కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఆమె అభిమానుల్లో కలవరం రేపుతోంది.
బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో అభిషేక్ బచ్చన్-ఐశ్వర్యారాయ్ ఒకరు. కెరీర్ పరంగా ఇద్దరూ ఎంతో ఫేమ్ చూసినవారే. ముఖ్యంగా ఐష్‌ను ఆరాధించే వారు కోట్లలో ఉన్నారు. ఎంతో చూడముచ్చటగా ఉండే ఈ జంట ఈమధ్య ఎక్కువగా కనిపించడం లేదు. సాధారణంగా ఎక్కడ ఏ కార్యక్రమాలు, వేడుకలు, సినిమా ఫంక్షన్లు జరిగినా భర్త అభిషేక్‌తో కలసి పాల్గొంటారు ఐశ్వర్య. అయితే ఈమధ్య మాత్రం ఆమె ఒంటరిగానే వెళ్తున్నారు. కొన్ని కార్యక్రమాలకు మాత్రం కూతురు ఆరాధ్యను తీసుకెళ్తున్నారు. కానీ అభిషేక్‌తో మాత్రం జంటగా ఆమె కనిపించడం లేదు.
రీసెంట్గా ముంబైలో జరిగిన నీతా-ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ లాంఛ్ ఈవెంట్‌కు కూడా ఐష్.. ఆరాధ్యతో కలిసే వెళ్లారు. వీరితో అభిషేక్ బచ్చన్ మాత్రం కనిపించలేదు. ఈ ఒక్క కార్యక్రమం అనే కాదు, చాలా సందర్భాల్లో ఐశ్వర్యారాయ్ వెంట భర్త అభిషేక్ కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఐశ్వర్యకు అభిషేక్‌తో ఏవో గొడవలు జరిగి ఉండొచ్చని నెటిజన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ఈ స్టార్ కపుల్ విడాకాలు తీసుకోబోతున్నారని సందేహిస్తున్నారు.
ఇకపోతే, ఐష్-అభిషేక్ విడిపోనున్నారంటూ వార్తలు రావడం ఇదేమీ కొత్తకాదు. 2014లోనూ వీళ్లిద్దరి బంధం చెడిందని, విడాకులు తథ్యమంటూ జోరుగా ప్రచారం సాగింది. దీనిపై అభిషేక్ స్పందించారు. ‘ఓకే, నేను డివోర్స్ తీసుకుంటున్నానని నమ్ముతున్నా. ఈ విషయం నాకు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. పనిలో పనిగా నా రెండో వివాహం ఎప్పుడో కూడా మీరే చెప్పండి’ అని అభిషేక్ కౌంటర్ ఇచ్చారు. అప్పట్లో విడాకుల మ్యాటర్‌పై స్పందించిన అభిషేక్ బచ్చన్.. ఇప్పుడు మళ్లీ వస్తున్న డివోర్స్ రూమర్స్ మీద రియాక్ట్ అవుతారేమో చూడాలి.