గతేడాది తెలుగు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది ప్రముఖ ఆహా ఓటిటి. ఆహా గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే.. గతేడాదిన్నర కాలంగా ఆహాలో లేటెస్ట్ తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్ లు, ప్రోగ్రామ్స్, టాక్ షోస్ చూస్తూ వస్తున్నారు. ప్రతి వారం కొత్త సినిమాలు రిలీజ్ చేయడమే కాకుండా వేరే భాషల్లోని హిట్ సినిమాలను తెలుగులోకి డబ్ చేసి అందిస్తోంది ఆహా.
ఇటీవల నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ప్రారంభించిన “అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే” టాక్ షో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ ఓటిటి ప్రారంభించిన కొన్ని నెలల్లోనే 11 మిలియన్లకు పైగా డౌన్ లోడ్స్ నమోదు చేసి ఆహా టాప్ ఓటిటిగా రికార్డు సృష్టిస్తోంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు నార్త్ ఇండియన్ టీవీ ప్రోగ్రామ్స్ కూడా తెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది ఆహ.
ఇప్పుడు దేశవ్యాప్తంగా సంగీత ప్రియులను అలరిస్తున్న ‘ఇండియన్ ఐడల్’ సింగింగ్ కంపిటిషన్ ని తెలుగులో ప్రోగ్రాంగా తీసుకురానుంది ఆహా . విశేషదారణ కలిగిన ఇండియన్ ఐడల్ షో.. ఇకపై తెలుగులో ‘తెలుగు ఇండియన్ ఐడల్’ పేరుతో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో కూడా ఆహా రిలీజ్ చేసింది. ఈ షోకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనుంది
ఆహా యాజమాన్యం. అలాగే ఈ షో అడిషన్స్ వివరాలు కూడా డిసెంబర్ 15న ఆహా ప్రకటించనుంది. చూడాలి మరి తెలుగులో ఇండియన్ ఐడల్ షో అనేసరికి ప్రేక్షకులలో ఆసక్తి మరింత పెరిగింది. ఈ షో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.