అఖిల్ 'ఏజెంట్' మూవీకి షాకింగ్ కలెక్షన్స్ వచ్చాయి. సినిమా రిజల్ట్ తేడా కొట్టేయడంతో.. తొలిరోజు డబుల్ డిజిట్ కలెక్షన్స్ ని అందుకోలేకపోయారు. అన్ని కోట్లు మాత్రమే వసూలైనట్లు తెలుస్తోంది.
అక్కినేని అఖిల్ కొత్త మూవీ ‘ఏజెంట్’ తాజాగా థియేటర్లలోకి వచ్చేసింది. స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తీసిన ఈ సినిమా.. రిలీజ్ కి ముందు ఓ మాదిరి అంచనాలు ఏర్పరుచుకుంది. కానీ తొలిరోజు టాక్ పూర్తిగా రివర్స్ అయిపోయింది. చూసిన ప్రతిఒక్కరూ పెదవి విరుస్తున్నారు. అఖిల్ కష్టం వృథా అయిందని మాట్లాడుకుంటున్నారు. భారీ బడ్జెట్ తో తీసినప్పటికీ.. ‘ఏజెంట్’ మిషన్ ఫెయిలయ్యాడని అంటున్నారు. ఇదే టైంలో ‘ఏజెంట్’ తొలిరోజు కలెక్షన్స్ కాస్త ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. ఇంతకీ ఎన్ని కోట్లు వచ్చాయి? ఏంటి సంగతి?
ఇక వివరాల్లోకి వెళ్తే.. నాగార్జున వారసుడిగా అఖిల్ 2015లో ఇండస్ట్రీలోకి వచ్చాడు. ‘అఖిల్’ పేరుతో తీసిన తొలి సినిమా బాగా హైప్ క్రియేట్ చేసింది కానీ హిట్ కొట్టలేక బాక్సాఫీస్ దగ్గర చతికిలపడింది. ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’ కూడా దాదాపు అదే ఫలితాన్ని అందుకున్నాయి. 2021లో వచ్చిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ ఓకే అనిపించింది. ఇప్పుడొచ్చిన ‘ఏజెంట్’ కూడా అస్సలు బాగోలేదని టాక్ వచ్చింది. ఈ క్రమంలో తొలిరోజు కలెక్షన్స్ ఎంతొస్తాయా అని ఎదురుచూసిన ఫ్యాన్స్ కి పెద్ద షాక్ తగిలిందని అంటున్నారు.
అయితే ‘ఏజెంట్’ రిలీజ్ కు ముందు కాస్త హైప్ ఉండటం తొలిరోజు వసూళ్లకు ప్లస్ అయినట్లు కనిపిస్తుంది. అందుకే వరల్డ్ వైడ్ రూ.7 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయని సమాచారం. అయితే పెట్టిన బడ్జెట్ బట్టి చూస్తే.. కనీసం రెండంకెల కలెక్షన్స్ అయినాసరే రావాలి. కానీ అలా జరగలేదని తెలుస్తోంది. ఈ విషయమై ఫుల్ క్లారిటీ రావాలంటే.. అధికారిక ప్రకటన వచ్చేవరకు చూడాలి. దాదాపు రెండేళ్లపాటు సెట్స్ పై ఉన్న ఈ మూవీ.. ఇన్నాళ్లకు థియేటర్లలోకి వచ్చింది. ఫలితం మాత్రం చిత్రబృందాన్ని నిరాశపరిచింది. తొలిరోజు ‘ఏజెంట్’ కాస్త కలెక్షన్స్ అందుకున్నాడేమో కానీ వీకెండ్ అయ్యేసరికి భారీ నష్టాలు కన్ఫర్మ్ అనిపిస్తుంది!? మరి ‘ఏజెంట్’ వసూళ్లపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
#Agent opens on a Disastrous note with an estimated ₹7 Cr WW Gross on 1st Day.
Producers sold the Entire AP & TS months ago and still had to release it in deficit due to Over Budget. pic.twitter.com/WBK5klKoI0
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) April 29, 2023