మెగా హీరో అనే ట్యాగ్‌తో అల్లు అర్జున్ సినిమాల్లోకి వచ్చినా.. ఆ ప్రభావం కాస్తయినా కనపడలేదు. తన నటన, డ్యాన్స్‌తో ప్రేక్షుకులను అలరించాడు. ఒక్కోమెట్టు ఎక్కుతూ స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రతి సినిమాలోనూ తనలోని కొత్త వేరియేషన్స్ చూపిస్తూ.. ఐకాన్ స్టార్ అయ్యాడు. ప్రస్తుతం అల్లు అర్జున్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో ఉంది. సౌత్ ఇండియాలోనే కాదు నార్త్ లో కూడా బన్నీకి మంచి మార్కెట్ ఉంది. పుష్ప మానియాతో.. ఆ రేంజ్ అమాంతం పెరిగిపోయింది.
ఈ క్రమంలో కమర్షియల్ కంపెనీలన్నీ.. యాడ్స్ కోసం బన్నీ వెంట పరుగెడుతున్నాయి. ఎంత అడిగినా ఇచ్చే అందుకు వెనుకాడాతం లేదు. ప్రస్తుతం బన్నీ.. కోకో- కోలా, రెడ్ బస్, ఆస్ట్రాల్, కేఎఫ్సీ, రాపిడో.. వంటి పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో బన్నీ యాడ్స్ లో నటించేందుకు రోజుకు.. రూ. 7.5 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Charging 7.5Cr Per day for an ad 🔥🔥
The most influential Pan Indian actor at present ” ALLU ARJUN” 👑
Many more brands are in line 🤙
He is in top gear of his game @alluarjun🌟 pic.twitter.com/yYqsdTYSRw
— Allu Arjun FC (@AlluArjunHCF) August 9, 2022
ఇవేకాక.. బన్నీ పలు బ్రాండ్లకు ఇప్పటికే ప్రచారకర్తగా ఉన్న విషయం విదితమే. ఈ మధ్యనే జొమాటో ఫుడ్ డెలివరీ యాప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా మారాడు. ఈ క్రమంలో ఓ యాడ్ కూడా చేశాడు. అది ఆకట్టుకునే విధంగానే ఉన్నప్పటికీ వివాదానికి దారి తీసింది. అయితే సదరు జొమాటో యాడ్‌లో నటించినందుకు బన్నీకి రూ.10 కోట్ల పైనే రెమ్యునరేషన్ ఇచ్చిందట.
మరోవైపు.. ‘పుష్ప 1’ బంపర్ హిట్ కొట్టడడంతో ‘పుష్ప 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పార్ట్ 1 కంటే పార్ట్ 2కు ఎక్కువ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. అయితే.. పుష్ప 2 కోసం బన్నీ భారీ స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొదటి భాగానికి రూ. 50 కోట్లు తీసుకున్న బన్నీ.. రెండో భాగానికి రూ. 100 కోట్లు తీసుకుంటున్నారని టాక్. ఇందులో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది. ఈ మధ్యనే ఓ తమిళ నిర్మాణ సంస్థ సైతం.. రూ.100 కోట్ల మేర రెమ్యునరేషన్ ఇస్తామని ఆఫర్ ఇచ్చిందట. కానీ అల్లు అర్జున్ ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు సమాచారం. బన్నీ రెమ్యూనరేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Nayanthara: వీడియో: నయనతార పెళ్ళి వేడుక టీజర్.. త్వరలోనే ఫుల్ వీడియో..
ఇదీ చదవండి: లైఫ్ లో ఫేస్ చేసిన కష్టాలను తలచుకొని శేఖర్ మాస్టర్ ఎమోషనల్!