ఆస్కార్ వేదికగా సందడి చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్నాడు. ఎన్టీఆర్ కి అభిమానుల నుండి ఘన స్వాగతం లభించింది. ఎన్టీఆర్ వస్తున్నాడని తెలిసి ఎయిర్ పోర్టుకు అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.
ఆస్కార్ వేదికగా సందడి చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్నాడు. ఎన్టీఆర్ కి అభిమానుల నుండి ఘన స్వాగతం లభించింది. ఎన్టీఆర్ వస్తున్నాడని తెలిసి ఎయిర్ పోర్టుకు అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అలాగే ఎన్టీఆర్ బయటికి రాగానే జై ఎన్టీఆర్ అంటూ నినాదాలతో అక్కడి వాతావరణాన్ని హోరెత్తించారు. తనకు ఇంతటి గ్రాండ్ వెల్కమ్ చెప్పిన ఫ్యాన్స్ కి ధన్యవాదాలు తెలిపిన ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ కి ఆస్కార్ రావడంతో తమపై మరింత బాధ్యత పెరిగిందని అన్నాడు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. “తమకు ఈ స్థాయిని కల్పించిన అభిమానులకు, ప్రేక్షకులకు పేరుపేరునా ధన్యవాదాలు. ఆస్కార్ వేదికపై నాటు నాటు పెర్ఫార్మెన్స్ ని లైఫ్ లో మరిచిపోలేను. ఆస్కార్ అవార్డు మాపై మరింత బాధ్యతను పెంచింది. రాజమౌళి చేతిలో ఆస్కార్ చూసి కళ్లలో నీళ్లు తిరిగాయి.. నాటు నాటు పాటకు అవార్డ్ అనౌన్స్ చేసినప్పుడు సంతోషాన్ని పట్టలేకపోయాం. స్టేజ్ పై కీరవాణి గారు, చంద్రబోస్ అవార్డులు అందుకున్నప్పుడు.. అది నా లైఫ్ లో మర్చిపోలేని మూమెంట్. అయితే.. అవార్డు విషయాన్నీ ముందుగా నా భార్యతో షేర్ చేసుకున్నాను” అని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా.. నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ ఆస్కార్ వేడుకలలో జక్కన్న దంపతులతో పాటు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దంపతులు కూడా సందడి చేశారు. ఇక ఎన్టీఆర్ ఇండియా రావడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే.. మార్చి 15న ఎన్టీఆర్ – కొరటాల సినిమా నుండి అప్ డేట్ ఉండటంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. కాగా.. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్30 పై అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటిస్తోంది. మరి ఎన్టీఆర్30 పై మీ అంచనాలు ఎలా ఉన్నాయో కామెంట్స్ లో తెలపండి.