లైలా.. తెలుగు ప్రేక్షకులకు ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి.. ఆమె నటన, అందం, అభినయంతో చాలా మంది ఫ్యాన్స్ ని సొంతం చేసుకుంది. 2004లో చివరిసారి.. మిస్టర్ అండ్ మిసెస్‌శైలజా కృష్ణమూర్తి అనే సినిమాలో హీరోయిన్ నటించింది. ఆ తర్వాత మరో రెండేళ్లు ఇండస్ట్రీలో సినిమాలు చేసింది. 2006 తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. తర్వాత 2019 తమిళ్‌లో ఓ కార్యక్రమానికి జడ్జిగా, 2020లో ఓ సీరియల్‌లో కనిపించింది. ఇప్పుడు లైలా తన కెరీర్‌లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిందనే చెప్పాలి. కార్తీ నుంచి రాబోతున్న సర్దార్ సినిమాలో లైలా నటిస్తోంది. అంతేకాకుండా చాలా ఏళ్ల తర్వాత మీడియా ముందుకు వచ్చింది.
లైలా చాలా గ్యాప్ తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సర్దార్ సినిమాకి సంబంధించి హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ ఈవెంట్‌లో లైలా కూడా పాల్గొంది.. “శివపుత్రుడు సినిమా 2003లో దీపావళి రోజు విడుదలైంది. అదే రోజు నా పుట్టినరోజు వచ్చింది. అలాగే ఇప్పుడు సర్దార్ సినిమా ఈ ఏడాడి దీపావళికి రాబోతోంది.. ఈ ఇయర్ కూడా నా పుట్టినరోజే దీపావళి రోజు వచ్చింది. చాలా ఎక్సైట్ గా ఉంది. అందరూ ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. అందరూ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. కార్తీ గారు ఈ సినిమాలో ఎంతో గొప్పగా చేశారు. అన్ని కోణాలతో ఈ సినిమా ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. అందరూ ఈ సినిమాని బాగా ఆదరిస్తారని ఆశిస్తున్నాం. నా తెలుగు కుటుంబానికి అందరికీ ధన్యవాదాలు” అంటూ లైలా చెప్పుకొచ్చింది.
కార్తీ నుంచి రాబోతున్న మరో అద్భుతమైన చిత్రం సర్దార్. కార్తీకి తెలుగులో ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. కార్తీ సినిమాకి తెలుగులోనూ తమిళ్ స్థాయిలోనే కలెక్షన్స్, రెస్పాన్స్ ఉంటుంది. కార్తీ కూడా ఎప్పుడూ తెలుగు ప్రేక్షకుల గురించే మాట్లాడుతూ ఉంటాడు. ఇంతటి ఆదరణ, సినిమాకి వచ్చే రెస్పాన్స్ తమిళ్‌లోనూ రాదంటూ చెబుతూ ఉంటాడు. యుగానికి ఒక్కడు సినిమాలోని ఎవర్రా మీరంతా డైలాగ్ గురించి చెబుతూ.. ఆ డైలాగ్ బాగా వైరల్ అవుతోందంటా.. అలాగే ఇంకో డైలాగ్ కూడా అవ్వాలి. ఎవర్రా మీరంతా.. ఇంత ప్రేమ చూపిస్తున్నారు అంటూ కార్తీ తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందని ఆశాభావాన్ని వ్యక్తపరిచాడు.