వెండితెరపై కొంతమంది హీరోహీరోయిన్ల జంటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఒక్కసారి హిట్టు పడ్డాక.. మళ్లీ వారి కాంబినేషన్ లో ఇంకో సినిమా వస్తే బాగుంటుంది అనే ఫీల్ ప్రేక్షకులలో కలుగుతుంది. అంటే.. ఆ కాంబినేషన్ ని జనాలు అంతలా ఇష్టపడుతున్నారన్నమాట. అలా టాలీవుడ్ లో జనాలను బాగా ఆకట్టుకున్న జంటలలో వెంకటేష్-భూమిక జంట ఒకటి.
వెండితెరపై కొంతమంది హీరోహీరోయిన్ల జంటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఒక్కసారి హిట్టు పడ్డాక.. మళ్లీ వారి కాంబినేషన్ లో ఇంకో సినిమా వస్తే బాగుంటుంది అనే ఫీల్ ప్రేక్షకులలో కలుగుతుంది. అంటే.. ఆ కాంబినేషన్ ని జనాలు అంతలా ఇష్టపడుతున్నారన్నమాట. అలా టాలీవుడ్ లో జనాలను బాగా ఆకట్టుకున్న జంటలలో వెంకటేష్-భూమిక జంట ఒకటి. వీరిద్దరూ కలిసి చేసింది ఒక్క సినిమానే అయినా.. వీరి జంటకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. దాదాపు 20 సంవత్సరాల క్రితం.. 2002లో వెంకీ, భూమిక “వాసు” సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా పెద్దగా విజయం సాధించకపోయినా.. వీరి కెమిస్ట్రీకి మాత్రం ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
వీరి కాంబినేషన్ లో మరో సినిమా వస్తే బాగుంటుందని అంతా భావించారు. కానీ.. ఆ తర్వాత వీరు జంటగా నటించే అవకాశం రాలేదు. దీంతో మరొకసారి వీరి జంటని తెరపై చూడాలని ఆడియన్స్ కి నిరాశే ఎదురైంది. అయితే.. ఫ్యూచర్ లో హీరోహీరోయిన్స్ గా నటించకపోయినా.. మరోసారి కనిపిస్తారేమో అనుకుని ఊరుకున్నారు ఆడియెన్స్. ఇంతలో వీరి కాంబినేషన్ గురించి లేటెస్ట్ గా ఓ క్రేజీ సర్ప్రైజ్ బయటికి వచ్చింది. 20 ఏళ్ళ తర్వాత వెంకీ – భూమిక జంటగా ప్రేక్షకులని కనువిందు చేయనున్నారు. కాకపోతే.. ఈసారి హీరోహీరోయిన్ క్యారెక్టర్స్ లో మాత్రం కాదు. వేరే హీరో సినిమాలో వీరిద్దరూ జంటగా మెరవనున్నట్లు తెలుస్తోంది.
ఆ వివరాల్లోకి వెళ్తే.. సల్మాన్ ఖాన్, పూజ హెగ్డే జంటగా “కిసీ కా భాయ్ కిసీ కా జాన్” అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రంజాన్ కానుకగా విడుదల కాబోతుండగా.. ఈ సినిమాలో టాలీవుడ్ నుంచి వెంకీ, రానా, జగపతిబాబు కూడా నటిస్తున్నారు. ఇదంతా మనం టీజర్ లోనే చూశాం. కానీ.. రీసెంట్ గా మేకర్స్ ఈ సినిమా నుండి ‘బిల్లీ బిల్లీ’ అంటూ కొత్త వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఇంకేముంది.. సర్ప్రైజింగ్ గా ఈ సాంగ్ లో వెంకీకి జోడిగా భూమిక ప్రత్యక్షమైంది. ఈ సాంగ్ లో వీరిద్దరూ జంటగా స్టెప్పులు వేస్తూ కనిపించారు. దీంతో వెంకీ – భూమిక వేసిన డ్యాన్సులు చూసి ఆడియన్స్ అవాక్కయ్యి.. ఇన్నేళ్ల తర్వాత జంటగా కనిపించనున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వీరు జంటగా స్టెప్పులేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక మరోవైపు వెంకీ.. యంగ్ డైరెక్టర్ శైలేష్ తో ‘సైంధవ్’ మూవీ చేస్తున్నాడు. మరి 20 ఏళ్ళ తర్వాత తెరపై అలరించనున్న వాసు పెయిర్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.