Adivi Sesh: విలక్షణమైన నటన, కొత్త దనం ఉన్న కథలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు అడవి శేష్. తీసింది కొన్ని సినిమాలే అయినా తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకున్నారు. కేవలం నటుడిగానే కాదు.. రచయితగా కూడా తనలోని బహుముఖ ప్రజ్ఞను బయటపెట్టారు. సక్సెస్ సాధించారు కూడా. తాజాగా, 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మేజర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే, అడవి శేష్ హీరోగా ఓ మంచి గుర్తింపు తెచ్చుకోవటం ఓవర్‌నైట్‌లో జరిగింది కాదు.
దాని వెనకాల దశాబ్ధాల కృషి ఉంది. అడవి శేషు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పటికి ఇరవై సంవత్సరాలు అయింది. తన మొదటి సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించారు. 2002లో వచ్చిన సొంతం సినిమా ఆయన మొదటి సినిమా. ఈ సినిమాలో హీరోయిన్ నమితను పెళ్లి చేసుకోబోయే వ్యక్తిగా కనిపించారు. ఆయన చేసిన క్యారెక్టర్ పేరు వెంకట్. సొంతం సినిమా వచ్చి దాదాపు 20 ఏళ్లు అయింది. ఆ సినిమాలో చాలా సన్నగా ఉన్నారు. ప్రస్తుతం, సొంతం సినిమాలోని అడవి శేష్ క్యారెక్టర్‌కు సంబంధించిన సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా, అడవి శేష్ ప్రస్తుతం హిట్ రీమేక్ అయిన హిట్ : సెకండ్ కేస్‌లో హీరోగా నటిస్తున్నారు. మీనాక్షి చౌదరి శేష్‌కు జోడీగా చేస్తున్నారు. ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. జులై 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. హిట్ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో హిట్ 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. సినీ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. మరి, అడవి శేషు ఫేమస్ కాకముందు చేసిన పాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Meena: ఎన్నెన్నో జన్మల బంధం.. మొదట రిజెక్ట్ చేసి, మళ్లీ ఆయన్నే పెళ్లి చేసుకున్న మీనా