సినీ ఇండస్ట్రీలో హీరోహీరోయిన్స్ మాట్లాడే మాటలు అప్పుడప్పుడు వివాదాలకు దారి తీస్తుంటాయి. మరికొన్ని జోక్ గా మిగిలిపోతుంటాయి. ఇటీవల హీరోయిన్ రెజినా అబ్బాయిలు, మ్యాగీ అంటూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. రెజినా, నివేద థామస్ తో కలిసి ‘శాకినీ డాకిని’ అనే సినిమా చేశారు. సుధీర్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది. రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో పాల్గొంటున్న రెజినా.. “అబ్బాయిలు, మ్యాగీ ఒకటే.. రెండూ రెండు నిమిషాల్లో అయిపోతాయి” అని అడల్ట్ జోక్ వేసింది. అది జోక్ అని చెప్పింది.. కానీ అదే ఇప్పుడు చర్చలకు దారితీసింది.
రెజినా వేసిన జోక్ కి ఎలాగో నవ్వలేక అందరూ షాకయ్యారు. అయితే.. తాజాగా శాకినీ డాకిని ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్ కి రెజినా, నివేదతో పాటు స్పెషల్ గెస్ట్ గా హీరో అడవి శేష్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా అడవి శేష్ మాట్లాడుతూ.. రెజినా వేసిన జోక్ గురించి అడిగాడు. “ఏంటి ఈ మధ్య మగాళ్లు, మ్యాగీ అని ఏదో అన్నావంటా.. నాకు స్టామినా ఎక్కువ.. అందుకే సినిమాలు ఎక్కువ కాలం తీస్తానని అంటుంటారు” అని అన్నాడు. దీంతో రెజినా స్పందిస్తూ.. “రెండు నిమిషాల్లో చెబుతా” అంటూ నవ్వేసింది. ప్రస్తుతం వీరి సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి రెజినా మగాళ్ళపై వేసిన జోక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.