సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది నటీ, నటులు వస్తుంటారు.. పోతుంటారు. అందులో కొంత మంది మాత్రమే ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతారు. అలా నిలిచిపోయిన నటుల్లో అడవి శేష్ కూడా ఒకరు. విలక్షణమైన కథల ఎంపికతోపాటు అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అరిస్తున్నాడు. ఈ ఏడాది ‘మేజర్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని సాధించాడు అడవి శేష్. ఇదే ఊపులో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్దమైయ్యాడు శేష్. డిసెంబర్ 2న ‘హిట్-2’ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈక్రమంలోనే ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఒక సినిమా చేసి మోసపోయానని, మూడు రోజులు షూటింగ్ చేయించుకుని తర్వాత వెళ్లిపొమ్మన్నారని శేష్ చెప్పుకొచ్చాడు.
అడవి శేష్.. రైటర్ గా, నటుడిగా, దర్శకుడిగా టాలీవుడ్ లో తనదైన ముద్రవేసుకున్నాడు. విలక్షణమైన కథలతో నిత్యం అభిమానులను థ్రిల్ కు గురిచేస్తూనే ఉన్నాడు. సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్లకు టాలీవుడ్ లో పెట్టింది పేరు అడవి శేష్. ఈ క్రమంలోనే మరోసారి క్రైమ్ థ్రిల్లర్ తో మనముందుకు రాబోతున్నాడు శేష్. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ‘హిట్-2’ సినిమా డిసెంబర్ 2న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మూవీ ప్రమోషన్లో బిజీ బిజీగా గడుపుతున్నాడు శేష్. ఇందులో భాగంగానే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
“అప్పుడు నాకు 15 సంవత్సరాలు. గడ్డం కూడా రాలేదు.. దాంతో మా అమ్మ పెట్టుకునే కాటుకను గడ్డంలా పెట్టుకుని అందరి ముందు బిల్డప్ కొట్టేవాణ్ని. అలాంటి టైమ్ లో నాకు ఓ సినిమా ఆఫర్ వచ్చింది. అదే సొంతం సినిమా. ఈ సినిమా విషయంలో నేను మోసపోయాను. ‘దిల్ చాహతా హై’ కి ప్రీ మేక్ చేస్తున్నాం. అందులో నలుగురు హీరోలు ఉంటారు, నువ్వూ ఒకడివి అన్నారు. దాంతో నేను ఆ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. కానీ తీరా చూస్తే మూడు రోజులే షూటింగ్ చేసి ప్యాకప్ చెప్పేశారు. నన్ను కూడా వెళ్లమన్నారు. నా జీవితంలో తెలిసీ తెలియని వయసులో చేసిన తప్పు అది” అంటు చెప్పుకొచ్చాడు అడవి శేష్. ఆ తర్వాత 10 సంవత్సరాల పాటు అమెరికాలో చదువుకుని.. సినిమాలపై పిచ్చితో మళ్లీ ఇండియాకు తిరిగి వచ్చానని శేష్ వివరించాడు.