Adivi Sesh: విలక్షణమైన నటన, కొత్త దనం ఉన్న కథలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు అడవి శేష్. తీసింది కొన్ని సినిమాలే అయినా తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకున్నారు. కేవలం నటుడిగానే కాదు.. రచయితగా కూడా తనలోని బహుముఖ ప్రజ్ఞను బయటపెట్టారు. సక్సెస్ సాధించారు కూడా. తాజాగా, 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మేజర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కలెక్షన్ల పరంగా కూడా ముందుకు దూసుకుపోతోంది. సినిమా హిట్ అయిన సందర్భంగా హీరో అడవి శేష్, దర్శకుడు శశి కిరణ్‌ని ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు.
ఈ ఇంటర్వ్యూలో అడవి శేష్, రామ్ గోపాల్ వర్మ తీసిన 26/11 సినిమా పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వర్మ ఆ సినిమాను వాడుకున్నారని అన్నారు. అడవి శేష్ మాట్లాడుతూ.. ‘‘ ఆ సినిమాను స్వార్థం కోసం వాడుకున్నట్లు అనిపించింది. జరిగిన దారుణాన్ని వాడుకున్నట్లు అనిపించింది. అది నిజాయితీగా అనిపించలేదు. ఆ సినిమాలో విలన్స్‌ను కూడా కమర్షియల్ సినిమాలో విలన్స్ లాగా క్లోజప్స్‌లో చూపించారు. సో.. నాకది నచ్చలేదు. నానా పటేకర్ నిజాయితీ గల స్పీచ్ నచ్చింది. ఫిలాసఫీ నచ్చింది కానీ, కమర్షియల్ సినిమాలాగా అనిపించింది’’ అని అన్నారు.
అదే ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి ‘‘ఈ మధ్య ఏ సినిమా ఫంక్షన్ అయిన.. చీఫ్ గెస్ట్‌గా వచ్చిన హీరోలను తెగ పొగుడుతూ.. వారి డబ్బా కొడుతున్నారు.. మా దేవుడు, అది ఇది అంటూ పొగుడుతున్నారు. మరి నువ్వు.. మహేష్ బాబు గురించి ఎక్కడా ఒక్క మాట కూడా మ్టాలాడలేదు.. సినిమా హిట్ అయ్యిందని పొగరా’’ అంటూ అడవి శేష్‌కు సూటి ప్రశ్న వేశారు. అందుకు అడవి శేష్ స్పందిస్తూ.. ‘‘మహేష్ బాబుకి సినిమా నచ్చితేనే ప్రశంసిస్తారు.. సినిమాలో ఆయనకు ఏం నచ్చిందో చెప్పి ప్రత్యేకంగా ప్రశంసిస్తారు. ఇక మేజర్ సినిమా టీజర్‌కు ముందు ఆయనకు సినిమా చూపించాం. మూవీ కంప్లీట్ కాగానే.. మహేష్ బాబు సైలెంట్‌గా బయటకు వెళ్లారు. మాకు టెన్షన్. మూవీ నచ్చిందా.. లేదా అర్థం కాలేదు. ఆయన దగ్గరకు వెళ్లి చూస్తే.. కంట్లో నుంచి నీరు కారుతోంది. సినిమా ఆయనను అంతలా టచ్ చేసింది. ఆ తర్వాత కంట్రోల్ చేసుకుని 2-3గంటలు మాతో మాట్లాడారు’’ అని అన్నారు. మరి, వర్మ సినిమాపై అడవి శేష్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Rashmi Gautam: ఎప్పుడూ నవ్వించేవారు ఏడిపించేశారు! స్టేజ్ పై కన్నీరు పెట్టుకున్న రష్మీ!