Aditi Shankar: ప్రముఖ డైరెక్టర్ శంకర్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అతిధి. తమిళ స్టార్ కార్తీ హీరోగా వచ్చిన ‘విరుమన్’ సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చారు. కార్తీ సరసన హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా ఆగస్టు 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తాజాగా, విరుమన్ సినిమా టీం తమిళనాడులోని ఓ సినిమా థియేటర్‌కు వెళ్లింది. అక్కడ ప్రేక్షకులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా అతిధి శంకర్ చెప్పిన ఓ జోక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ జోక్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు.
ఇంతకీ అతిధి శంకర్ చెప్పిన జోక్ ఏంటంటే.. ‘‘ ఆదివారం రోజు గొడవ పడొచ్చు.. కానీ, సోమవారం రోజు చనిపోగలమా?’’ అని జోక్ చేశారు. దీన్ని ఆమె తమిళంలో చెప్పారు.. ‘‘ సండే అన్నికి సండ పోడలాం.. ఆనా.. మండే అన్నికి మండయ పోడముడుయుమా?’’ అని ప్రాస వచ్చేలా ఆమె చెప్పారు. ఈ జోక్‌పై నెటిజన్లు ‘‘ జోక్ ఆఫ్ ది ఇయర్’’ అంటూ ట్రోల్స్ మొదలుపెట్టారు. ‘‘ పాపం! మొదటిసారి బయటి ప్రపంచాన్ని చూస్తున్నట్లు ఉంది. అందుకే దాన్ని జోక్ అనుకుంటోంది’’.. ‘‘ ఆమె పిచ్చి వాగుడు తట్టుకోలేకనే శంకర్ సినిమాల్లోకి పంపినట్లు ఉన్నాడు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కాగా, అతిధి శంకర్ శ్రీ రామకృష్ణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో చదివారు. ఎంబీబీఎస్ డిగ్రీ పూర్తి చేశారు. సినిమా మీద ఇంట్రస్ట్‌తో తండ్రిని ఒప్పించి ఇండస్ట్రీలోకి వచ్చారు. ప్రస్తుతం ఆమె శివకార్తికేయన్ ‘‘ మావీరన్’’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి, అతిధి శంకర్ చెప్పిన జోక్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Jᴏᴋᴇ ᴏғ ᴛʜᴇ Yᴇᴀʀ 🤣🤣🤣 @AditiShankarofl 💖 pic.twitter.com/f0AXZZ4lJa
— Priya Cinemas – Madurai (@Priya_Cinemas) August 22, 2022