టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. శర్వానంద్- రక్షితారెడ్డిల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి దంపతుల నుంచి టాలీవుడ్ ప్రముఖులు, సెలబ్రిటీలు అంతా ఈ వేడుకకు హాజరై కొత్త జంటను దీవించారు. అయితే వేడుకకు హాజరైన వారిలో ఓ జంట మాత్రం బాగా హైలెట్ అయ్యారు. వాళ్లే సిద్ధార్థ్– అదితిరావ్ హైదరీ. శర్వానంద్ నిశ్చితార్థానికి జంటగా వచ్చి కాబోయే జంటను అభినందించారు. అయితే అందులో వింతేముంది అంటారా? అయితే వీళ్ల రిలేషన్ గురించి ఎప్పటినుంచో పుకార్లు నడుస్తున్న విషయం తెలిసిందే.
వీళ్లు ముగ్గురు మహాసముద్రం సినిమాలో కలిసి పనిచేశారు. కాబట్టి కలిసి వచ్చి విష్ చేసుంటారని అనుకోకండి. అది కూడా ఒక రీజన్ అయ్యి ఉండచ్చు. కానీ, సిద్ధార్థ్- అదితీ మధ్య రిలేషన్ ఉన్నట్లు, వాళ్లు డేటింగ్ చేస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పుకార్లపై ఇంతవరకి సిద్ధార్థ్ గానీ, అదితీరావ్ హైదరీ గాని స్పందించింది లేదు. వారి మధ్య ప్రేమ ఉందని వాళ్లు చెప్పింది లేదు. వచ్చే పుకార్లను ఖండించింది కూడా లేదు. ఎవరు ఏం మాట్లాడినా వాళ్లు మాత్రం మౌనంగా ఉంటున్నారు. వాళ్లు నోరు మెదపకపోయే సరికి ఈ పుకార్లు మరింత ఎక్కువగా వినిపిస్తున్నాయి.
తాజాగా వీళ్లు కలిసి శర్వానంద్ నిశ్చితార్థానికి హాజరు కావడంతో మరోసారి వీళ్ల రిలేషన్ వార్తలు ఊపందుకున్నాయి. వారి మధ్య ప్రేమ ఉందని చెప్పకనే చెబుతున్నారంటూ కామెంట్ చేస్తున్నారు. గతంలో కూడా అదితీరావ్ పుట్టిన రోజు సందర్భంగా సిద్ధార్థ్ ఒక కామెంట్ చేశాడు. ఆమెతో సన్నిహితంగా ఉన్న పిక్ ఒకటి షేర్ చేస్తూ.. హ్యాపీ హ్యాపీ హ్యాపీబర్త్ డే ప్రిన్సెస్ ఆఫ్ హార్ట్ అంటూ కోటేషన్ పెట్టుకొచ్చాడు. అప్పుడు కూడా వారి రిలేషన్ గురించి వార్తలు జోరందుకున్నాయి. మరోసారి జంటగా ఫొటోలకు ఫోజులు ఇవ్వగానే క్లారిటీ ఇచ్చేశారంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. త్వరలోనే వీళ్లు కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు కాబోలు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.