Adire Abhi: తెలుగు బుల్లితెరపై ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న షో జబర్దస్త్. ఈ షోలో కమెడియన్స్ పార్మమెన్స్ కి, పంచ్ డైలాగులతో కూడిన కామెడీ టైమింగ్ కు ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుతుంటారు. ఇలా మంచి పేరు తెచ్చుకున్న నటులలో అదిరే అభి ఒకరు. తన కామెడీతో బుల్లితెరపై ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సినిమాల్లో కూడా నటిస్తూ ఉంటారు. ఇక ఈ మధ్య జబర్దస్త్ ని వీడిన అభి.. కామెడీ స్టార్స్ పోగ్రామ్ ద్వారా ప్రేక్షకులను పలకరించాడు. ఇక అదిరే అభి తను ప్రధాన పాత్ర పోషిస్తూ ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుపుకుంటోంది. ఇందులో భాగంగానే తాజాగా షూటింగ్ లో పాల్గొన్న అభికి పెను ప్రమాదం తప్పింది. ఈ మూవీ చిత్రీకరణలో కొన్ని యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు.
ఈ సన్నివేశాల్లో పాల్గొన్న అభి ప్రమాదానికి గురయ్యాడట ఈ ప్రమాదంలో చేతికి, కాలికి తీవ్ర గాయాలు అయ్యాయని తెలుస్తోంది. దీంతో వెంటనే స్పందించిన చిత్ర యూనిట్ అభిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇక అదిరే అభికి చేతికి మొత్తం 15 కుట్లు పడ్డట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అభి ఆరోగ్య పరిస్థితి క్షేమంగానే ఉన్నట్లుగా సమాచారం. ఇక అందరితో ఎంతో కలుపుగోలుగా ఉండే అదిరే అభి ప్రమాదం గురి కావడంపై బుల్లితెర అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. మరి.. అదిరే అభి ఈ ప్రమాదం నుండి త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.
ఇవి కూడా చదవండి : Dog: 777 చార్లీ సినిమాలో నటించిన డాగ్ బ్రీడ్ పూర్తి వివరాలు!