Jabardasth: బుల్లితెరపై అనేక షోలు తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కొన్ని షోలకు అయితే ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉంటారు అంటే అతిశయోక్తి కాదు. అలాంటి వాటిల్లో జబర్దస్త్ కామెడీ షో ఒక్కటి. మాములుగా వచ్చి.. అసాధారణ స్థాయిలో కొన్నేళ్ల పాటు తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ ఇప్పటికి కొనసాగుతోంది. జబర్దస్త్ షో.. ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడంతో పాటు చాలా మందికి లైఫ్ నిచ్చింది. ఈ షో పై నెగిటీవ్ కామెంట్స్ కూడా వినిపించాయి. ఈ షోలో బూతులు ఎక్కువగా ఉంటాయంటూ చాలామంది అభిప్రాయ పడేవారు. అయితే ఇటీవల జబర్దస్త్ షోల్లో బూతులు చాలా వరకు తగ్గాయి. అలా తగ్గడానికి కారణం ఏమిటో జబర్దస్త్ కమెడీయన్ అదిరే అభి బయటపెట్టారు.
తెలుగు టెలివిజన్ లో అత్యధిక టీఆర్పీ రేటింగ్ అందుకునే షోలలో జబర్దస్త్ ఒకటి. ప్రముఖ కమెడియన్స్ తో మొదలైన ఈ షో ప్రస్తుతం అనేక మంది కొత్తవాళ్లు కూడా తమ టాలెంట్ ని నిరూపించుకుంటున్నారు. అయితే ఈ షోపై కొన్నాళ్లు నెగిటీవ్ కామెంట్స్ కూడా ఎక్కువగా వచ్చాయి. కామెడీ పేరుతో బూతులు బాగా వాడుతున్నారని కొందరు అభిప్రాయపడ్డారు.ఇటీవల కాలంలో మాత్రం అడల్ట్ కంటెంట్ చాలా వరకు తగ్గిపోయింది. అందుకు గల కారణాలను సీనియర్ కమెడియన్ అదిరే అభి తెలిపారు. జబర్దస్త్ అన్ని వర్గాల ప్రేక్షకులు చూసే విధంగా ఉండాలి కాబట్టి ఈ షోలో ఇప్పటి నుంచి ఎలాంటి అడల్ట్ కంటెంట్ ఉండకూడదని,
ఇదీ చదవండి: మోహన్ బాబు నన్ను బూతులు తిట్టాడు.. అందుకే బయటికొచ్చా: నటుడు బెనర్జీడబుల్ మీనింగ్ డైలాగ్స్ అలాగే బూతులు కూడా ఎక్కువగా ఉండకూడదని మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుందట. అలాగే కమెడియన్స్ కూడా ఎక్కువగా అలాంటి కంటెంట్ పై ఆలోచించకుండా భిన్నమైన కామెడీ తో ఆకట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు అభి వివరణ ఇచ్చాడు. జబర్దస్త్ యాజమాన్యం చెప్పినట్లు చాలావరకు షో లో అడల్ట్ కంటెంట్ తగ్గిపోయిందని అభి అన్నారు. మరి.. అభి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.