ప్రభాస్.. ఈ పేరు వినపడితే చాలు.. ఫ్యాన్స్ పూనకంతో ఊగిపోతారు. అతడికి సంబంధించి ఏ చిన్న వార్త వచ్చినా సరే.. నిమిషాల్లో వైరలవుతుంది. ఇక ప్రభాస్ కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నది ప్రభాస్ పెళ్లి వార్త గురించే. కానీ ఇప్పట్లో అది జరిగేలా లేదు. ఇక కొన్ని రోజుల క్రితమే ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కుటుంబ సభ్యులంతా తీవ్ర విషాదంలో ఉన్నారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఫుల్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. ఆయన చేతిలో ఉన్నవన్ని భారీ బడ్జెట్, పాన్ ఇండియా చిత్రాలే. అందుకే కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొని ఉన్నప్పటికి.. తన వల్ల నిర్మాత నష్టపోకూడదనే ఉద్దేశంతో షూటింగ్‌కు హాజరవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే అయోధ్యలో నిర్వహించిన ఆదిపురుష్ టీజర్ లాంచ్ ఈవెంట్‌కి కూడా హాజరయ్యాడు.
అయితే గత కొన్ని రోజులుగా ప్రభాస్-కృతి సనన్‌లకు సంబంధించి ఓ వార్త తెగ వైరలవుతోంది. ఏంటంటే.. ప్రస్తుతం వీరద్దరూ లవ్‌లో ఉన్నారని జోరుగా వార్తలు ప్రచారం అయ్యాయి. తాజాగా ఆదిపురుష్ టీజర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా వీరిద్దరి మధ్య చోటు చేసుకున్న కొన్ని సంఘటలను చూస్తే.. నిజంగానే లవ్‌లో ఉన్నారేమో అనిపించకమానదు. మరీ ముఖ్యంగా ప్రభాస్ పట్ల కృతి సనన్ ప్రత్యేక శ్రద్ధ కనపర్చడం కెమరాల కంటికి చిక్కింది. దాంతో ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి
ఆదిపురుష్ టీజర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా ప్రభాస్ జ్యోతి ప్రజ్వలన చేసేందుకు వస్తాడు. అప్పటికే కాస్త ఆలస్యం అవుతుంది. దాంతో కృతి సనన్ త్వరగా రా అంటూ ప్రభాస్‌ని పిలుస్తుంది. వచ్చాక అతడినే జ్యోతి వెలిగించమంటుంది. అయితే ఓం రౌత్ చేతిని పట్టుకుని ప్రభాస్ జ్యోతిని వెలిగిస్తాడు. దీంతో కృతి కూడా.. ప్రభాస్ చేతినే తను పట్టుకుంటుంది. మరో చోట ప్రభాస్ తనకు చెమటలు పడుతుంటే ఇబ్బందిపడ్డాడు. అది చూసిన కృతి.. తన కొంగును ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ ప్రభాస్ మాత్రం తన చేత్తోనే తుడుచుకున్నాడు. దాంతో కృతి సనన్ ముసి ముసి నవ్వులు నవ్వుతూ సిగ్గు పడుతుంది. ఇలా చాలా చోట్ల వీరిద్దరి ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే.. ఇద్దరి మధ్యన ఏదో ఉందేమో అనిపించక మానదు.
#KritiSanon Giving Her Saree To #Prabhas To Sweep His Sweat
Great Bonding 👏#Adipurush pic.twitter.com/eTwJKtBONZ
— North Prabhas FC (@NorthPrabhasFC) October 2, 2022
గతంలో కాఫీ విత్ కరణ్ షోలో కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. షోలో భాగంగా కరణ్.. కృతికి ఓ టాస్క్ ఇస్తాడు. మీ లైఫ్‌లో మీరు ఫోన్ చేసిన వెంటనే లిఫ్ట్ చేసే వ్యక్తి ఎవరో.. వారికి కాల్ చేయమని చెప్తాడు. అప్పుడు కృతి సనన్ వెంటనే ప్రభాస్‌కు ఫోన్ చేస్తుంది. ఈ సంఘటన తర్వాత వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉందని అభిమానులకు అర్థం అయ్యింది. ఇక తాజాగా చోటు చేసుకున్న సంఘటనలు చూస్తే.. వీరిద్దరి మధ్య ఏదో ఉందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.