శ్రీరాముడి అతిగొప్ప భక్తుడైన ఆంజనేయుడికి నివాళిగా ‘ఆదిపురుష్’ చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘ఆదిపురుష్’. జూన్ 16న వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరందుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో మూవీ టీమ్ భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్కు ప్లాన్ చేస్తోంది. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో జరగబోయే ఈ కార్యక్రమాన్ని కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతో నిర్వహిస్తున్నారని సమాచారం. ఈ ఈవెంట్కు ముఖ్య అతిథిగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చిన్న జీయర్ స్వామి అటెండ్ కానున్నారు. ఈ కార్యక్రమంలో సినిమా చరిత్రలోనే ఫస్ట్ టైమ్ 50 అడుగుల ప్రభాస్ హాలో గ్రామ్ను కూడా ప్రదర్శించనున్నారు. ఈ ఈవెంట్ నిర్వహణను యంగ్ డైరెక్టర్ ప్రశాంత వర్మ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ అయితే సినిమాపై మరింత బజ్ పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రీ రిలీజ్ ఈవెంట్కు పనులు వేగంగా పూర్తవుతున్న నేపథ్యంలో ‘ఆదిపురుష్’ టీమ్ కీలక నిర్ణయం తీసుకుంది. మూవీ రిలీజ్ టైమ్లో థియేటర్ల వద్ద టికెట్ల విక్రయ విషయంలో ఒక డెసిజన్ తీసుకుంది. ఈ చిత్రాన్ని ప్రదర్శించే ప్రతి థియేటర్లో ఒక సీటును అమ్మకుండా హనుమంతుడి కోసం ప్రత్యేకంగా కేటాయించనున్నారు. ఈ మేరకు ‘ఆదిపురుష్’ మూవీ టీమ్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ‘రామాయణ పారాయణం జరిగే ప్రతి చోటకు హనుమంతుడు విచ్చేస్తాడనేది మన నమ్మకం. ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ ప్రభాస్ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్’ సినిమాను ప్రదర్శించే ప్రతి థియేటర్లో ఒక సీటును విక్రయించకుండా హనుమంతుడి కోసం ప్రత్యేకంగా కేటాయించడం జరుగుతుంది’ అని మూవీ టీమ్ పేర్కొంది. మరి.. ఆంజనేయుడికి నివాళిగా ‘ఆదిపురుష్’ టీమ్ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#Adipurush to dedicate one seat in every Theatre to Lord #Hanuman and will be kept unsold honouring the beliefs of Lord Ram Bhakts. pic.twitter.com/tLCNZli2Rz
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) June 5, 2023