‘ఆదిపురుష్’ మూవీని ప్రదర్శిస్తున్న ఒక థియేటర్లోని అద్దాలను ప్రభాస్ ఫ్యాన్స్ పగులగొట్టారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..!
ఎన్నో అంచనాల నడుమ ‘ఆదిపురుష్’ మూవీ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రభాస్ యాక్ట్ చేయడం, ‘రామాయణం’ ఆధారంగా రూపొందిన మూవీ కావడంతో ‘ఆదిపురుష్’పై అంచనాలు ఒక రేంజ్లో ఏర్పడ్డాయి. అయితే సినిమాకు మాత్రం మిక్స్డ్ టాక్ వచ్చింది. ప్రభాస్ మూవీ బాగుందని కొందరు అంటుంటే.. అస్సలు బాగోలేదని ఇంకొందరు అంటున్నారు. లంకను చూపించిన విధానం, రావణుడి పాత్రను మలచిన తీరు, వీఎఫ్ఎక్స్ క్వాలిటీపై సోషల్ మీడియాలో నెటిజన్స్ విమర్శలకు దిగుతున్నారు. ట్రైలర్‌లాగే మూవీ కూడా అద్భుతంగా ఉంటుందని అనుకొని వచ్చామని.. కానీ దర్శకుడు ఓం రౌత్ తమను పూర్తిగా నిరాశపర్చాడని చెబుతున్నారు. ప్రభాస్ గెటప్‌తో పాటు హనుమంతుడి పాత్రకు రాసిన డైలాగ్స్ బాగోలేవని కామెంట్స్ చేస్తున్నారు.
‘ఆదిపురుష్’ దర్శకుడు ఓం రౌత్ పై నెట్టింట ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ట్రోలింగ్‌కు దిగుతున్నారు. ఓం రౌత్‌కు రామాయణంపై ఏమాత్రం అవగాహన లేదని అంటున్నారు. రామాయణాన్ని వక్రీకరించారని కొందరు నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. టీజర్‌పై ఏవిధంగా అయితే విమర్శలు వచ్చాయో.. ఇప్పుడు రిలీజ్ తర్వాత కూడా మూవీపై అంతేస్థాయిలో విమర్శలు, ట్రోల్స్ రావడం గమనార్హం. ఇవన్నీ అటుంచితే.. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ‘ఆదిపురుష్’ విడుదలైన థియేటర్ల వద్ద తెగ సందడి చేస్తున్నారు. థియేటర్ల దగ్గర పండుగ వాతావరణం సృష్టిస్తున్నారు. అయితే కొన్నిచోట్ల మాత్రం డార్లింగ్ ఫ్యాన్స్ అత్యుత్సాహం చూపిస్తున్నారు. సినిమా చూశాక ప్రభాస్ అభిమాని ఒకరు బీర్లతో చేతులను కోసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. అదేగాక ఒక థియేటర్లో ప్రభాస్ ఫ్యాన్స్ అద్దాలు పగులగొట్టడం చర్చనీయాంశంగా మారింది. పటాన్చెరులో ‘ఆదిపురుష్’ మూవీని ప్రదర్శిస్తున్న జ్యోతి థియేటర్లో సౌండ్ సిస్టమ్ బాగోలేదని అక్కడి అద్దాలు ధ్వంసం చేశారు డార్లింగ్ ఫ్యాన్స్.
సినిమా థియేటర్ అద్దాలు పగులగొట్టారు
పటాన్‌చెరు – ఆదిపురుష్ సినిమా ప్రదర్శిస్తున్న జ్యోతి థియేటర్లో సౌండ్ సిస్టం బాగాలేదని థియేటర్ ధ్వంసం చేసి అద్దాలు పగలగొట్టిన ప్రభాస్ ఫ్యాన్స్. pic.twitter.com/SRSkByzShF
— Telugu Scribe (@TeluguScribe) June 16, 2023