మీరు ప్రభాస్ 'ఆదిపురుష్' కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే ఈ బ్యాడ్ న్యూస్ మీకోసమే. ఎందుకంటే మూవీ టీమ్ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఫ్యాన్స్ ఆలోచనలో పడిపోయారు.
డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘ఆదిపురుష్’. ఎంతో భారీ బడ్జెట్ తో ఈ మూవీని రామాయణం ఆధారంగా తీశారు. మరో నెలరోజుల్లో అంటే జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా భారీ రేంజులో విడుదల కానుంది. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్.. అంచనాల్ని పెంచేసింది. దీంతో మూవీపై బజ్ మంచిగానే క్రియేట్ అవుతోంది. సరిగ్గా ఇలాంటి టైంలో చిత్రబృందం ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు అది కాస్త ఫ్యాన్స్ కి ఎక్కడలేని డౌట్స్ క్రియేట్ చేస్తోంది. ఇంతకీ ఏం జరిగింది? ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ ‘సాహో’, ‘రాధేశ్యామ్’ సినిమాలు చేశాడు. ఇందులో ఒకటి యాక్షన్ ఎంటర్ టైనర్, మరొకటి లవ్ స్టోరీ. ‘ఆదిపురుష్’.. రామాయణం ఆధారంగా తీస్తున్న పీరియాడికల్ మూవీ కావడంతో అభిమానులు చాలా ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసుకున్నారు. కానీ గతేడాది టీజర్ రిలీజ్ కాగా.. దానిలో గ్రాఫిక్స్, లీడ్ రోల్స్ లుక్స్ వల్ల మూవీపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ఘోరంగా ఉన్నాయని ప్రతి ఒక్కరూ విమర్శించారు. దీంతో ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన మూవీని జూన్ కి వాయిదా వేశారు. ఈ గ్యాప్ లో గ్రాఫిక్స్ పై దృష్టిపెట్టారు. ఆ రిజల్ట్ రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ లో కనిపించింది.
ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ‘ఆదిపురుష్’ మూవీని ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించనున్నట్లు కొన్నాళ్ల ముందు ప్రకటించారు. దీనిబట్టి థియేటర్లలో రిలీజ్ కి మూడు రోజుల ముందే అంటే జూన్ 13న ప్రీమియర్ షోలు పడాలి. ఇప్పుడు వాటిని క్యాన్సిల్ చేసేశారు. జూన్ 15న సాయంత్రం ఆ షోలని వేస్తున్నారు. జూన్ 17న మధ్యాహ్నం 12 గంటలకు మరో షో వేస్తున్నారు. చెప్పాలంటే దీనికంటే ముందే అమెరికాలో ప్రీమియర్ షోలు పడతాయి. అలాంటిది ‘ఆదిపురుష్’ టీమ్ ఇలా చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
జూన్ 13న పడాల్సిన ‘ఆదిపురుష్’ ప్రీమియర్ షోలు ఎందుకు క్యాన్సిల్ చేశారు? అనే డౌట్ ఫ్యాన్స్ మధ్య ఇప్పుడు చర్చకు కారణమైంది. ఒకవేళ రెండు రోజుల ముందే షోలు పడితే రివ్యూలు బయటకొచ్చేస్తాయి. సినిమా బాగుంటే పర్లేదు. ఒకవేళ ఏమైనా తేడా కొడితే మాత్రం ఓపెనింగ్ కలెక్షన్స్ తోపాటు రిజల్ట్ దారుణంగా వస్తుంది. ఇందుకే ప్రీమియర్స్ ని రద్దు చేశారా? లేదా ఇంకేదైనా కారణం ఉందా? అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. మరోవైపు ట్రైలర్ లో గ్రాఫిక్స్ కి సంబంధించి షాట్స్ ఏం చూపించకుండా సేఫ్ గేమ్ ఆడారనే డౌట్ కూడా వచ్చింది. ఇలా అన్నీ చూస్తుంటే ‘ఆదిపురుష్’ టీమ్ ఏదో దాస్తుందని అనిపిస్తోంది. మరి మీకు కూడా ఇలా ఏమైనా అలా అనిపిస్తే కింద కామెంట్ చేయండి.